ఈ పుటను అచ్చుదిద్దలేదు

516

కవి జీవితములు.

శా. స. 1438 (A. D. 1515) అగునేఁటి యువనామసంవత్సరమందు కళింగదేశము జయించవలె నని విచ్చేసి కర్ణాటకదేశము విడిచి, జమ్మిలోయఁబడి కోననుంచి కొఠాముమార్గానను పొట్నూరునుండి వడ్డాదిమాడుగులు సాధించి, కటకముమీఁద మోహరముచేసి ప్రతాపరుద్ర గజపతితో యుద్ధముచేయఁగా గజపతి కటకపురి విడిచి పరారీ అయి లేచిపోయినాఁడు. తరువాతను సలహా అయి, నరపతికృష్ణరాయలకుఁ దనకుమార్తెను ఇచ్చినాఁడు. అంతట నరపతికృష్ణరాయలవారు తిరిగీ విద్యానగరమునకు లేచిపోయినారు."

"ఈప్రకారము జరుగుచుండఁగా రావువారనేకొందఱిని, పశ్చిమరాజ్యమందు బెజవాడదగ్గఱ పూసపాటి మాధవర్మ అనేరాజు సహించలేక వారితో యుద్ధముచేసి అపజయము అయినవారినిఁ గలగానుగుల ఆడించి చంపించినాఁడు" అను మొదలగు సంగతులు వ్రాయంబడి యున్నవి. ఇట్లుపూసపాటి మాధవవర్మ వృత్తాంతమే రావువారి వంశావళీ గ్రంథ మగువాసవదత్తా పరిణయ మనుపద్య కావ్యములోఁ గూడ వివరింపఁబడియున్నది. కావున పైవృత్తాంతము లన్నిటింబట్టి పూసపాటి రాచిరాజుమాత్రము కృష్ణరాయలవలన జీవగ్రాహముగాఁ బట్టుకొనంబడి నట్లుగాని పిమ్మట వదలివేయఁ బడినట్లుగాని కానుపించలేదు. తక్కిన పైశాసనాంశముల దృఢపఱుచునట్టిగాథ లీవఱకే మన మీచామర్లకోట కైఫీయతులో వివరించియుంటిమి. గావున నింక నీశాసన విశేషములు వ్రాయమానెదను. అదివఱకు పూసపాటి రాచిరాజును పట్టుకొనుటకుఁ గృష్ణరాయండు యత్నించినను వీరరుద్ర గజపతితోఁ గల్గిన పై నవీనసంబంధబట్టి తనకుఁ దోడియల్లుఁ డైన కారణంబుననైన నాప్రయత్నము మాని మిన్న కుండకపోఁడు. ఇది రాచిరాజు వృత్తాంతము.

నెం 4 శాసనము. శా. స. 1441 సం. సింహాచలము.

"స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1441 అగునేఁటి ప్రమాది నామసంవత్సర శ్రావణ శు. 13 సోమ