ఈ పుటను అచ్చుదిద్దలేదు

512

కవి జీవితములు.

మీశాసన సమయము కావచ్చును. శాసనార్థము నట్లె కానుపించును గావున దాని సంగ్రహ మిట వివరించెదను. ఎట్లన్నను :-

కృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి మొదలు పాత్రసామంతులనున్ను మన్నే వారినిన్ని అనువఱకుఁ బూర్వపుశాసనార్థమే తిరుగ వివరింపఁబడినది. ఈశాసనకాలమునాఁటికి నట్టి సామంతులలో నొకరిద్దఱు తప్ప తక్కినవారిని జీవగ్రాహముగా (ప్రాణములతో) పట్టుకొని వారికి నభయదాన మిచ్చె ననునది విశేషము. పైశాసనములోని వారిపేరులు కొన్నియు నీశాసనములో వారిపేరులు సరిపడి యుండకుండుటం జేసి ఆ రెండుపట్టికల నిట వివరించెదను.

మొదటిశాసనము పేరులు. ప్రస్తుత శాసనముల పేరులు.
1 ప్రతాపరుద్ర గజపతికుమారుఁడు వీరభద్రరాయఁడు 1. ప్రతాపరుద్ర గజపతి మహారాయల కొమారుఁడు వీరభద్రరాయఁడు.
2. కుమారహంవీరమహాపాత్రుని కొడుకు వీరమహాపాత్రుఁడు, 2. కుమార హంవీర మహాపాత్రుని కొడుకు నరహరిదేవు.
3. రాచూరి మల్లవఖానుఁడు 3. రాచూరియలువఖానుఁడు.
4. ఉద్దండభానుఁడు, 4. ఉద్దండఖానుఁడు.
5. పూసపాటి రాచిరాజు, " " " " " "
6. శ్రీనాథరాజు, లక్ష్మీపతిరాజు, 6. శ్రీనాథరాజు రామరాజు కొడుకు లక్ష్మీపతిరాజు
7. జన్యామలక సవాపాత్రుఁడు, 7. జన్యాముల కసవాపాత్రుఁడు,
8. పశ్చిమబాలచంద్రమహాపాత్రుఁడు. 8. తుమ్మపాలచంద్రమహాపాత్రుఁడు.

పైపట్టికలలోని పేరులలోఁ గొంచెము భేద మున్నను అవి పాఠాంతరములుగాఁ గైకొనఁదగియున్నవి. పైపట్టికలోని అయిదవపేరు గల పూసపాటి రాచిరాజుపేరు కాన్పించకుండుటకు గారణ మరయవలసియున్నది. ఇది ప్రమాణ మైన నై యుండు నని యెంచి దాని నివర్తించుటకు గ్రంథాంతర మరయుదు నని నలసంవత్సర పంచాంగము పీఠికలోఁ బ్రచురింపఁబడిన కర్ణాటకరాజులపేరులున్న పట్టికం జూడ దానిలో నీక్రిందివిధంబుగఁ గృష్ణరాయ రాజ్యవిశేషము లున్నవి. అవి