ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

507

రాజు, శ్రీనాథరాజు లక్ష్మీపతిరాజు, జన్యామలక సవాపాత్రుఁడు, పశ్చిమ బాలచంద్రమహాపాత్రుఁడు, మొదలుగాను పాత్రసామంతులను, మన్నెవారిని, జీవగ్రాహముగాను పట్టుకుని వారికి అభయదానమిచ్చి, ధరణికోటకు అమరేశ్వరులకై వేంచేసి, స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1437 అగునేఁటి యువసంవత్సర, ఆషాఢ బ. 12 భానువారమునకు కృష్ణవేణీనదీతీరమందు అమరేశ్వరదేవుల సన్నిధిని తులాపురుష మహాదానము సేయ నవధరించి తమదేవులు, చిన్నా దేవమ్మచేతను రత్నధేను మహాదానమున్ను, తిరుమల దేవమ్మ గారిచేతను సప్తసాగర మహాదానమున్ను, చేయించ నవధరించి తమ తండ్రి నరసారాయణిం గారికిన్ని, తమతల్లి నాగాదేవమ్మకున్ను పుణ్యముగాను అమరేశ్వరదేవుని నై వేద్యమహాపూజలకు ధారాపూర్వకముగాను సమర్పించిన పెద్దమద్దూరిగ్రామ మొకటి చతుర్వేద విద్యాపారగు లైనబ్రాహ్మణోత్తములకు, నూట యెనమండ్రుకు గ్రామములు. 4

2. 1 అద్దంకి సీమలో నిచ్చిన నిడమానూరుగ్రామము.
    1 అమ్మనబ్రోలు సీమలో వల్లూరుగ్రామము
______
__2___
తమపురోహితులకు సర్వక్రతు సర్వతోముఖ వాజపేయయాజు లైనరంగనాథదీక్షితులకున్ను శివాదీక్షితులకున్ను.

2. 1 అమ్మనబ్రోలుసీమలో ధారాపూర్వకముగా నిచ్చిన క్రొత్తపల్లి.
     1 త్రోవగుంట
_______
4._2___

ఈ ధర్మాలు ఆచంద్రార్కముగాను ఎవరు తప్పకనడుపుదురో ఆ పుణ్యపురుషులయొక్క పాదాలు మాశిరస్సున ధరించేము. ఈధర్మములకు ఎవరు హాని తలఁచినా నడుపని పాతకులు తమతల్లిదండ్రులను, బ్రాహ్మణులను, కపిలధేనువులను, కాశిలో గంగాతీరమందు చంపిన పాపాన పోఁగలవారు.