ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

505

3. కర్నూలుజిల్లాశాసనములలో శా. స. 1432, 1439, 1452 మెట్టున శాసనములు నాలుగు. కృష్ణాజిల్లాకుఁ బోవుట కీజిల్లా మార్గము కావునను, ఇందుఁ గూడ శ్రీశైలము, అహోబలము మొదలగుదేవస్థలము లుండుటచేతను పైసంవత్సరములలోఁ గృష్ణరాయలు ప్రాగ్దేశములోనే విశేషకాల ముండె నని యూహింపవచ్చును.

4. చెంగల్పట్టుజిల్లా శాసనములో శా. స. 1433, 1437, 1439, 1440, 1441, 1441, 1452, 1453, అనునివి యెన్మిది శాసనములు.

5. బెల్గాంజిల్లాశాసనములు, 1437 ఇది యొక్కటియే శాసనము. ఇట్టి తేదీశాసనములలో నొక్క చెంగల్పట్టుజిల్లాలోనే గాని కానుపించదుకావున నాసంవత్సరమంతయుఁ గృష్ణరాయలు ఆరెండుదేశములలోనే యున్న ట్లూహించవలసి యున్నది.

6. నెల్లూరిజిల్లా శాసనములలో. శా. స. 1438, 1442, 1444, 1444, 1446, 1453, అను నివి యాఱు.

7. దక్షిణ ఆర్కాడుజిల్లా శాసనములలో 1439, 1443, 1453 అను నివి మూఁడు.

8. మధురజిల్లా శాసనము 1443. ఈతేదీశాసనము దక్షిణ ఆర్కాడులో మాత్రము కానుపించును. కాఁబట్టి కృష్ణరాయలావత్సర మారెండుదేశముల కార్యములు నడిపి యుండవచ్చును.

9. కడపశాసనములు 1444, 1449 అనునవి రెండు.

10. మైసూరుశాసనము 1445 అనునిది యొకటి.

11. విశాఖపట్టణముజిల్లా శాసనములలో రెంటికి తేదులు లేవు.

శా. స. 1432 లో బళ్లారి, కృష్ణా, కర్నూలు. 1433 లో చెంగల్పట్టు. 1434 లో బళ్లారి. 1435లో బళ్లారి 1436 లో బళ్లారి. 1437 లో చెంగల్పట్టు, బెల్గాం. 1438 లో కృష్ణా, నెల్లూరు. 1439 లోబళ్లారి, కృష్ణా, కర్నూలు చెంగల్పట్టు, దక్షిణ ఆర్కాడు. 1440 లో చెంగల్ పట్టు. 1441 లో చెంగల్పట్టు, కృష్ణా. 1442 లో నెల్లూరు. 1443 లో బళ్లారి, కృష్ణా, దక్షిణఆర్కాడు, మధుర. 1444 లో బళ్లారి, నెల్లూరు, కడప. 1445 లో మైసూరు. 1446, 1447 లో నెల్లూరు. 1448 లో కృష్ణా. 1449 లో కడప, 1450, 1451 లో బళ్లారి. 1452 లో బళ్లారి, కర్నూలు, చెంగల్పట్టు. 1453 లో నెల్లూరు, దక్షిణఆర్కాడు.

పైసంవత్సరములోఁ గృష్ణరాయఁ డేయేదేశములతో వ్యవహరించుచుండెనో బోధయగును. వీనింబట్టి కృష్ణరాయనిరాజ్యము పైస్థలము లున్నంతవఱకు వ్యాపించియుండె ననుటకు సందియము లేదు. తారీఖులు లేని విశాఖపట్టణపు శాసనములు నేను సంపాదించియున్నాఁ