ఈ పుటను అచ్చుదిద్దలేదు

494

కవి జీవితములు.

పైపాలెగాఁడును, మఱికొందఱును గృష్ణరాయని లక్ష్యము చేయక అతనితో యుద్ధము చేసి పరాజితుం జేసి రను కోపముతోఁ గృష్ణరాయలు చతురంగబలసమేతుఁడై ఫిరంగులు మొద లగునాయుధములతోను మఱి కొందఱు పాలెగాండ్రతోడను ప్రయాణమై పోయి కర్ణాటకదేశములో కావేరితీరమందున నుండు పశ్చిమరంగమునకుఁ దూర్పుగానున్న శివసముద్రముకోటను ముట్టడించి, ఆశివసముద్రపు పాలెనానికి శత్రువైన చిక్కరాయనిం జేర్చుకొనిమఱికొందఱు పాలెగాండ్రనుచేర్చుకొని ప్రేతపర్వతము, గౌరికొండ అనుస్థలములలో దండు దిగి యొక సంవత్సరముపైని ఒత్తినకనుమ కావేరిమార్గములో కోటను హల్లాచేసెను. అపుడాగంగయరాయఁడు గంగఁడు శుచి అను కావేరి మడుఁగులోఁ బడి పోయెను. అటుపిమ్మట కృష్ణరాయః డాకోటను స్వాధీనము చేసికొనెను" అనియున్నది. ఉమ్మత్తూరు శివసముద్రము లనుకోటలను గృష్ణరాయలు భేదించినవృత్తాంతము పారిజాతాపహరణములో రెండవ యాశ్వాసమున నీక్రిందివిధముగ వర్ణింపఁబడియె, ఎట్లన్నను :-

శా. సమ్మర్దక్షమధీనిబంధనవిధాసంక్రందనాచార్య ళూ
     రమ్మన్యాచలవజ్రపాతజగతీరక్షాంబుజాక్షా శర
     ధ్యమ్మార్గస్థదశాస్యరాజ్యసమసహ్యప్రోద్భవాతీరభా
     గుమ్మత్తూరి శివసముద్రపురనప్రోన్మూలనాడంబరా."

అని చెప్పఁబడియున్నది. "కొంగవంశపురాజకాల్" గ్రంథములోఁ బై రెండుకోటలును పట్టినపిమ్మటఁ గృష్ణరాయఁడు శ్రీరంగపట్టణమునకుఁ బోయి కాంబగౌడఁడు, వీరప్పగౌడఁడు అనువారి స్వాధీనములోఁ గొన్ని దేశములును, చిక్కరాయని వశములోఁ గొన్ని దేశములును విడిచి, ఆసమీప మందుండెడుమఱికొనీ పాళియంపట్టులు జయించి వానిం బరిపాలింప తగవరులనియమించి బేరీజుద్రవ్యము నేర్పాటుచేసి కర్ణాటదేశము కోటిద్రవ్యమునిచ్చుదానిఁగాఁ జేసెను. అట్టి కర్ణాటదేశమున కంతకు నధికారస్థానముగా నుండుటకుఁ దగిన శ్రీరంగపట్టణము దిట్టపఱిచి ప్రభవసంవత్సరములో మహాబిరుదు కలుగఁ జేసికొని దానియందుఁ గృ