ఈ పుటను అచ్చుదిద్దలేదు

492

కవి జీవితములు.

చేసెను." అని యున్నది. శాసనములలో గ్రీ. శ. 1509 - 77 = శా. స. 1432 మొదలు కృష్ణదేవరాయ లధికారము చేసినట్లు కానుపించును. వీరనరసింహరాయని శాసనము శా. స. 1430 వఱకు నుండుటచేత నతనిమరణమునకును కృష్ణరాయని పట్టాభిషేకమునకును వ్యవధి యుండక పోవుటచేతను ఆకాలము పైరెండు శాసనముల మధ్యకాల మై యుండును. అందు విశేష భేదము లేదు గనుక దానిని క్రీ. డ. 1507 - 77 = శా. స. 1430 గా నిర్ణయించెదను. ఇది విభవ సంవత్సరమని కర్ణాటరాజుల కాలనిర్ణయ పట్టికలో నున్నది. వీరనరసింహ రాయని యనంతరమే కృష్ణరాయ లధికారి యయినందులకు పైపద్య కావ్యములు నుపబృంహణము చేయుచున్నవి. అందు పారిజాతాపహరణములో

"శా. వీరశ్రీనరసింహశౌరిపిదప న్విశ్వక్షమామండలీ
       ధౌరంధర్యమునన్ జనంబు ముదమందన్ నాగమాంబాసుతుం
       డారూఢోన్నతిఁగృష్ణరాయఁడు విభుండై రాజ్యసింహాసనం
       బారోహించె విరోధులున్ గగన శైలారోహముం జేయఁగన్."

"క. అవిభుననంతరంబు ధ, రావలయముఁ దాల్చెఁ గృష్ణరాయఁడు చిన్నా
     దేవియు శుభమతి తిరుమల, దేవియునుం దనకుఁగూర్చుదేవేరులుగాన్." మను.

కృ. రాయనిధర్మపత్నులు.

వీరిపేరులు చిన్నాదేవియు తిరుమలదేవియు నని పైమనుచరిత్ర పద్యములలోఁ గాన్పించుచున్నది. పారిజాతాపహరణములోఁ గృతిముఖంబున నీయంశము వివరింపఁబడలేదుకాని ద్వితీయా శ్వాసములో "తిరుమలదేవీవల్లభ" అనియును, తృతీయాశ్వాసములో

"క. శ్రీవేంకటగిరివల్లభ, సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
     జీవితనాయక కవితా, ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా."

అని యున్నది. వీని యనంతర కృతి యగునాముక్తమాల్యదలో మాత్రము కృష్ణరాయనిభార్యలు, తిరుమలదేవి, అన్నపూర్ణాదేవి అని చెప్పంబడి యుండెను. ఎట్లన్నను :-

"క. అవిభుననంతరంబ ధ, రావలయముఁ బూని తీవు రహిమైఁ దిరుమ
     ల్దేవియును నన్నపూర్ణా, దేవియుఁ గమలాబ్జముఖులు దేవేరులు గాన్."