ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

489

స్నేహము చేసుకొనిరి. కర్ణాటదేశము కొంకణదేశము, ఉమ్మత్తూరు, తలకాడు మొదలయిన గళ్లలోనున్నపాలెగాండ్రు కప్పము పంపకపోయినందున వీరనరసింగరాయఁడు కోపించి అనేక సేనలం జేర్చుకొని తనకు తమ్ముఁ డైనకృష్ణరాయలను విజయనగరములోనుంచి తాను అచ్యుతరాయ, శ్రీరంగరాయలును, మఱికొందఱు రాకొమరులు ప్రయాణమై పోయి ఉమ్మత్తూరు సమీపములో దండుదిగి, తమకు పూర్వమిచ్చెడువ న్నిచ్చినచో రాజ్యములో నుంచెదమనియు, లేకున్నఁ గోటలగ్గలఁ బట్టెదమనియుఁ జెప్పిపంపెను. దానికి మాఱుగా నుమ్మత్తూరిరాజు యీక్రిందివిధంబుగఁ జెప్పినంపె. ఎట్లన్నను :- "మేమీదేశమును బహుదినములుగాఁ బాలించుచున్నాము, మావంశములో నుండువారుగాని కొంకణవర్మరాజులుగాని యీదేశమును పరిపాలించిరి. వారెవ్వరికిని కప్పమిచ్చెడునాచారములేదు. అట్లుండ మీతండ్రి నరసింగరాయఁడు బలము కల్గియుండుటవలన జయించి కప్పము దీసికొనియెను. గాని అట్లు తీసుకొనుటకు న్యాయములేదు. కావున మేము కప్పము గట్టము." అట్టిసమాచారమునకు వీరనరసింగరాయఁడు కోపించి తమకుఁ బూర్వులగు హరిహర రాయఁడు మొదలగువారికిఁ గప్పముకట్టి తనకుఁ గట్టనని చెప్పుట అక్రమమని యూహించి ఉమ్మత్తూరుకోట ముట్టడించెను. అట్లుగా మూఁడుమాసములు ముట్టడి వదలక యుండినను దానిని లక్ష్య పెట్టక ఉమ్మత్తూరురాజు కోట శత్రులకు స్వాధీనము కాకుండ కాపాడి శత్రువులను విశేషముగాఁ దూలించెను. అపుడు వీరనరసింగ రాయఁడా కోటను పట్టుకొనలేక దండును మఱల్చుకొని శ్రీరంగపట్టణమునకు వచ్చి అక్కడి కోటను ముట్టడించెను. అయితే ఆకోటలోని ప్రభుఁడు పెద్దనరసింగరాయనివలన పట్టముగట్టఁబడిన జీవగ్రాహ్యునికొడుకైయుండెను. అతఁడు తనకోటను గట్టిచేసుకొని ఉమ్మత్తూరు, తలకాడు పాలెగాండ్రకు వర్తమానముచేసి, వారిసేనాసహాయమునంది, కోటవెలుపలికి వచ్చి వీరనరసింగరాయనిసేనలలోఁ జొరఁబడి విశేషయుద్ధముచేసి యోడించిన వీరనరసింగరాయఁడు కొంతనష్టముతో విజయనగరమునకు వచ్చి చేరెను.