ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

487

నరసింహదేవరాయనిచేత నొప్పగించి సకలకార్యములలో నీకృష్ణరాయనిఁ గూడ నుంచుకొని వ్యవహారము చేయుటచేఁ గీర్తిప్రతిష్టలు రాఁగల వని బోధించి లోకాంతరము నందెను. అని యున్నది. ఇందులోఁ బైకథలకు విరోధించనిభాగము నమ్మవచ్చును.

నరసింహరాయని భార్యలు పుత్త్రులు.

పైగ్రంథములోను "కొంగదేశరాజకాల్" అనుగ్రంథములోఁగూడ నరసింహదేవరాయని యాలుబిడ్డలఁ గూర్చి వివరింపఁబడియున్నది. అందులోని పైగ్రంథములో "తిప్పాంబ యను భార్య యందు వీరనృసింహేంద్రుఁడు అనుకుమారుఁడు పుట్టెను. నాగులాంబ అను భార్యయందుఁ గృష్ణరాయఁడు పుట్టెను. ఓబాంబయనుభార్యయందు రంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు అను నిర్వురుపుత్త్రులు పుట్టిరి. వారు నల్గురును బహుధర్మాత్ములై శౌర్యాదిగుణములు గలవారలై యుండిరి." అని యున్నది. ఇటులనే కొంగదేశరాజకాల్, అను గ్రంథములోఁగూడ నున్నది. వీనింబట్టి చూడఁగ నరసింగరాయనికి మువ్వురు భార్యలు, నల్వురు కొడుకులు నున్నట్లుగాఁ గానుపించుచున్నది. ఈరెండు గ్రంథములలోఁ గృష్ణరాయలు కృతులందినపారిజాతాపహరణ, మనుచరిత్రగ్రంథములును, కృష్ణరాయకృత మగునాముక్తమాల్యదయు నేకీభవింపవు. ఎట్లన్నను :-

"క. ఆనరసమహీమహిళా, జానికిఁ గులసతులు పుణ్యచరితులు తిప్పాం
      భానాగాంబిక లిరువురు, దానవదమనునకు రమయు ధరయును బోలెన్." పారి.

      పుత్త్రులవిషయమై

"శ. వారలలోఁ దిప్పాంబకు, మారుఁడు పరిపంథికంధిమంథాచలమై
     వీరనరసింహరాయఁడు, వారాశిపరీతభూమివలయం బేలెన్." పారి.

"తే. అనృసింహప్రభుండు తిప్పాంబవలన, నాగమాంబికవలన నందనులఁ గాంచె
      వీరనరసింహరాయ భూవిభుని నచ్యు, తాంశసంభవుఁ గృష్ణరాయక్షితీంద్రు." మను.

ఇ ట్లీపై రెండుగ్రంథములలో నొక్కతీరుగనే చెప్పి యుండుటం బట్టి వీనిలోఁ జెప్పంబడినవారే నరసింహరాయని పత్నీ పుత్త్రులు