ఈ పుటను అచ్చుదిద్దలేదు

486

కవి జీవితములు.

ముఁ డని ప్రజలవలనఁ గొనియాడఁబడుచు బహుదినములు విజయనగరమున నుండి కొన్నిదినములకు సకలదేశములం జయించి, సకల కిరీటాధిపతులచేతను మ్రొక్కులు తీసుకొనుటకు దిగ్విజయార్థము తరలి దక్షిణ సముద్ర పర్యంతము నుండు సకలదేశములం గొట్టి తద్దేశాధిపతులను దనయాజ్ఞానువర్తులుగాఁ జేసికొని, యాయాదేశములకుఁ దగినట్లుగా నర్థముం గూర్చుకొని కొంత విజయనగరమునకుం బంపి కొంత దనతోఁ బట్టించుకొని అక్కడనుండి రామేశ్వరమునకుఁ బోయి ఆ దేశములం దర్థము కట్టుకొని, అక్కడ సర్వాగ్రహారము లిచ్చి అటులనే సకలపుణ్యక్షేత్రములలో ధర్మముల నడిపెను. అటు తరువాత చోళ, పాండ్య, కేరళ, దేశపురాజులను, మధురదేశపుప్రభువును మ్లేచ్ఛప్రభువులం జయించి, అది మొదలు గంగాతీరముదాఁక సకలదేశములం జయించి శ్రీరంగమునకు వచ్చి చేరెను. అక్కడఁ జోళదేశమునకుఁ గేవలము కావేరినదియొక్క యుదకము ప్రవహించిన ఫలాదిక్య మగు నని యెంచి, వేయికాల్వలఁ ద్రవ్వించి, అవి శాశ్వతము లగుటకుఁ గాను పంచలోహములతోఁ గట్టలు వేయించి, వేలూరునకుఁ బోయి యచ్చోఁ దమసంస్థానము శ్రీరంగమునకుఁ గాంచీపురమునకును సమీపముగా నుండవలె నని యెంచి ఆవేలూరునకుఁ గోట కట్టించి అందులో దివ్యభవనంబులు గట్టించి అక్కడ దక్షిణదేశములకు తఖ్తు (సింహాసనము) నేర్పఱిచి, కొన్నిదినము లచ్చటఁ బ్రభుత్వము చేసి, పిమ్మట మఱికొన్నిదినములకు వేలూరున కుత్తరముగ నుండుచంద్రగిరియందు శత్రుభయము లేక యుండును గావునఁ దాను సంపాదించినద్రవ్య మచ్చట నుండుట మంచిదని యెంచి, దానికిం గోటఁ గట్టించి, తాము నివసించుటకు మహళ్లు గట్టించి అందుఁ దా సంపాదించిన ద్రవ్య ముంచి ఆస్థలమును భద్రపఱిచి తిరుగ విజయనగరమునకు నరసింగరాయఁ డు వచ్చి చేరెను. ఇట్లు చేరిన రాయఁడు తనపెద్దకుమారు డగు వీర నరసింహదేవరాయనికిఁ బట్టాభిషేకము చేసి, కృష్ణరాయనిం బిలిచి వీర