ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

485

ఇ ట్లుండుటంబట్టి యీనరసింహరాజు చారిత్రాంశములు కొన్ని స్పష్టమగుచున్నవి. అవి యెట్లనఁగా :-

1. దిగ్విజయము చేసి శాసన స్తంభంబులు నిలిపెను.

2. కళింగ రాజు, యవనరాజు మొదలగువారిచేఁ బన్నులు గొనుచుండెను.

3. విజయనగరసింహాసనాధ్యక్షుఁడు.

4. కుంతలేశ్వరుం జయించి విద్యాపురము (Beejapore) ను స్వాధీనమును చేసికొనియెను.

5. పారసీకునకు (తురుష్క రాజపర్యాయముకానోపు) మానవదుర్గ సీమలో బ్రాణహానిం జేసెను.

6. చోళ రాజును సంహరించి మధురాపురముం గైకొనెను.

7. శ్రీరంగపట్టణ సీమయం దుండుయావనేంద్రునితో యుద్ధముచేసెను.

8. మండలీకర మేఘమార్తాండ బిరుదు గలవాఁడు.

ఈ యెన్మిది యంశములును నప్రమాణములు. వీనితోఁ బ్రతిఘటించని పైచారిత్రాంశములను విశ్వసించుట కభ్యంతర ముండదు. విజయనగర రాజచరిత్రములో నీరాజుంగూర్చి యీక్రిందివిధముగా నున్నది. అందులో నృసింహదేవరాయనివఱకును వ్రాయంబడినచరిత్రము బీజనగరరా జగు బుక్క రాజుచరిత్ర మై యున్నది. ఆచారిత్రకుని కందుఁ గలభేదములు పరిశీలనలోనికి రానికారణమున నారెండుకథలును గలిపి వానిని నరసింహరాయనిపూర్వుల కథలుగా వివరించె ననియుఁ జెప్పవలసియున్నది. అట్టిభేదమును బీజనగర రాజచారిత్రములోఁ జూపఁదలంచి ప్రస్తుతము నరసింగరాయనింగూర్చి వ్రాసిన కథాభాగము మాత్ర మిచ్చట వివరించెదను. ఎట్లన్నను :-

"ఆబుక్క దేవరాయనికి నరసింహుఁ డనుకుమారుఁడు పుట్టెను. నృసింహదేవరాయలు విజయనగరమందు రాజ్యపరిపాలన చేయుచుఁ దమదండ్రి యేప్రకార మాజ్ఞాపించెనో ఆప్రకారము దేవబ్రాహ్మణులయందు భక్తి నుంచి అనేకు లగుబ్రాహ్మణులకు ననేకాగ్రహారములు తామ్రశాసన పత్త్రికలపై వ్రాసి యిచ్చి తండ్రికంటె నుత్త