ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

469

ప్రాచీనమార్గము నవలంబించిక పోరాదనియు న ట్లవలంబించు నపు డది పునరుక్తి యగు ననిపించుకొనునట్లు చెప్పరా దనియును, నేర్పుగలవాఁడే కావ్యము చేసిన ప్రతిష్ఠ కల్గునుగాని నేర్పు లేనిచోఁ గవిత్వము చెప్పుట తన తెలివి లోపమును ప్రపంచమందు స్థిరపర్చి యుంచుట యగుననియును, నేర్పు కల్గి కవిత్వము చెప్పువాఁడు తా నేరసముం జెప్పఁబోవుచున్నాఁడో ఆరసమును బైకి నుబికించి దానివలన నితరుల రంజింపఁ జేయ వలయు ననియు, నట్లు చేయ లేనిచో రసజ్ఞు లాకావ్యముం దిలకించక పరిహరించెద రనియును, ఫణామండితము లగుపాము లసంఖ్యము లై యుండినను విశ్వవిశ్వంభరాభరణదక్షత యొక శేషునకే కాక యితరఫణులకు లేనట్లు పద్యము లల్లఁగల మనుకొనువా రందఱు ప్రబంధములు రచియింపలే రనియు, నితరులు చెప్పిన గ్రంథములలోని యలంకారాదికములు దొంగిలి తాను గ్రంథము చేసినట్లు చెప్పుకొనువాఁడు లజ్జాహీనుఁడు గాఁ దెలియఁబడుననియు, నెంత రసజ్ఞుడైనఁ దనకుఁ గలరసికత్వమును వాగ్విలాసమును జూపింపకున్న నజ్ఞుఁడుగా భావింపఁబడు ననియును, గావ్యములలోని తప్పులు వెదకి సంతోషపడువాఁడు దుర్మార్గుం డనియును, లేమావిచిగురు కోకిలమునకువలె నాకవిత్వ మొకరసికునకు నైన సంతోషకారి కాకపోదు. రసికులు తప్పు గల ప్రియురాలిం దేర్చి సంతసింపం జేయునట్లుగా నాకవనంబునఁ ద ప్పున్న దిద్ది దానిం దిలకించెదరు గాక అనువఱకుం జెప్పియుండెఁగావున నప్పుడు తనకవిత్వములోఁ దప్పున్నట్లు తానే యొప్పికొనిన ట్లగుకావున నట్టి సందియము తనకవిత్వములో లేదనియును, తనకవిత్వములో నేవర్ణనఁ దాఁ జేయుచున్న నట్టికావ్యరసము స్ఫురియించుటయేకాక ఆయాపట్లు వినెడువారికిః దమ తమ వర్ణాశ్రమ వ్యాపారముల మఱపు గల్గి రసపారవశ్యంబున కేవలము తద్వ్యతిరేకధర్మావలంబనము కలుగుననియును జెప్పుటకై యీక్రిందిపద్యముం తెల్పె. అది యెద్దియనిన :-