ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

467

వ్యములయొక్కయుఁ బ్రసంగంబు చేసి అందులోఁ దనకావ్యవిశేషములఁ గొన్నిటిం జెప్పెను. ఈ ఫక్కిక ప్రాచీననవీన కావ్యములలోఁ జూపట్టనిదై మురారికవియొక్క ఫక్కికయై కాన్పించు. పైపద్యములలోఁ సుకవిసంబంధము లగుపద్యముల ముందు వివరించెదను. ఎట్లన్నను :-

"చ. మనమునఁ గొన్న నెవ్వగలు మాన్పి ఘటింతు రకాండసమ్మదం
      బనఘకథాముఖంబున హితాహితబోధ మొనర్తు రింపుగాఁ
      గనుఁగొనుకంటె నద్భుతముగా నెఱిగింతు రతీంద్రియార్థముల్
      ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగారె సత్కవుల్."

ఇఁకఁ గువికనిరాకరణ మీక్రింది విధంబునం జేయుచున్నాఁడు . -

ఉ. అంతము గాఁగ శబ్ద హృదయజ్ఞులు గా రుచిరప్రయోగముల్
    వింతలుగాఁ బ్రబంధముల వీథులు ద్రొక్కఁగలే రశక్తులై
    దొంతరజిల్లిబొంత లెడ దూర్చి గతార్థమె కూర్చుదుష్కవి
    భ్రాంతుల సందడిం దఫవఁ బాసె రసజ్ఞులకుం గవిత్వముల్. అని

కవిత్వవిశేషములు.

పురాణకవులలోఁ దిక్కనసోమయాజివలెఁ గావ్యకవులలో నీ నరసింహకవి స్వోద్దిష్ట కావ్యములలోఁ గల్గెడుకొన్ని విశేషములు వివరించెను. దానియభిప్రాయ మారయ నావఱకుఁ గల్గినకావ్యములలో నట్టి విశేషములు లే వనియు నవి ముఖ్యములు కాకున్న నాకావ్యములలోఁ బ్రౌఢిమ తక్కువగుననియు వారియంతరం గాభిప్రాయము గా దోఁచెడిని. నన్నయ భట్టుకవనంబులో లేనిమెఱుఁగు లెట్లు తిక్కనసోమయాజి తన కవిత్వములోఁ దేఁగోరెనో అటులనే నృసింహకవి అల్లసాని పెద్దనకవిత్వములో లేనిమెఱుఁగులు తనకావ్యములోఁ దెచ్చెదనని కొన్ని విశేషములఁ బ్రదర్శించినట్లు కానుపించును. పురాణకవనముఁ లో నన్నయతిక్కనల కెట్టితారతమ్య మున్నదో ప్రబంధకవిత్వములో పెద్దననారసింహకవుల కట్టి భేద మున్నదని యూహింపవలసియుండును. ఇట్లు చెప్పుటవలన నన్నయపెద్దనల కవిత్వములో లోపము లున్న వని చెప్పుట కాదు. ఆకవు లిర్వురకు నవ్యవహితముగ నట్టికావ్యములే రచియిం