ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

465

అని యున్నది. దీనిక్రింద వ్రాసిన పద్యములో ననుకూలనాయకాన్వేషణంబు జేయుటకు మాఱుగ ముందుఁగఁ బ్రతికూలనాయక నిర్ణయంబు చేసి నరకృతినిందం జేసి పిమ్మట ననుకూలనాయకుని నిర్ణయించుకొని నట్లుగా నున్నది. నరకృతి జేయనివారలందఱు నవలంబించిన ఫక్కిక యిది కాదని ఆంధ్రభాగవతముతక్క తక్కిన గ్రంథములన్నియు సాక్ష్యమిచ్చుచున్నవి. ఆయాంధ్రభాగవతములోఁగూడ నరకృతి చేయ వలసిన యవసర మొకటి యేర్పడిన పిమ్మటనే దానిం దిరస్కరించి అట్టి తిరస్కరణమును లిఖితరూపంబుగాఁ జేయంబడినదికాని అదిలేనిది కా లేదు. అటులనేయీనృసింహకవికిఁగూడ మొదట నరకృతి చేయునవసరము కలిగినపిమ్మటనే ఆయూహ మార్చుకొనినట్లు కానుపించును. దాని నెట్లు చెప్పె ననఁగా :-

"సీ. ఆందోళికలయందు నంతరచరు లైన, శవకృతాకృతులఁ బిశాచజనుల
      వాలవీజనములఁ గ్రాలుచు నీఁగకుఁ, గాలునిఖరవర్తులాండసముల
      వేత్రపరంపరావిలకంటకాకృతిఁ, జేరఁబోరాని బర్బూరతరుల
      పరకరాలంబులై ప్రార్థింపఁ గైకోక, వాయెత్తకుండుజీవచ్ఛవముల.

గీ. శంఖనాగస్వరాదిక శ్రవణసమద, విస్ఫుటచ్ఛత్ర విస్ఫారితస్ఫటాక
    దిష్టవిషవైద్య వశవర్తిదుష్టఫణుల, ప్రభుదురాత్ముల వెవ్వాఁడు ప్రస్తుతించు.

గీ. నరగుణాంకిత మయ్యెనే నరసకృతియు, దూష్య మగు శునకో ద్వృత్తదుగ్ధ మట్ల
    హరిగుణాంకిత మయ్యె దే నరసకృతియు, హారసూత్రంబుగతి హృదయంగమంబు."

అని అప్రస్తుత మగునరకృతినింద నొనరించి పిమ్మట తా నేర్పఱుచుకొనిన కృతిపతి గుణవిశేషముల నీక్రింది విధంబునం జెప్పె. ఎట్లన్నను :-

"సీ. జగదేకపతి యయ్యు సకలాభిగమ్యుండు, సర్వశాసకుఁ డయ్యు సదహృదయుఁ
      డభిమతప్రదుఁ డయ్యు నంజలిసాధ్యుండు, పరిపూర్ణుఁ డయ్యును బ్రణుతికాముఁ
      డతిగతేంద్రియుఁ డయ్యుననిమేషదృగ్దృశ్యుఁడనియోజ్యుఁడయ్యు భక్తానుయాయి
      సాక్షి యయ్యు నతాపచారానభిజ్ఞుఁడు, సముఁ డయ్యు నార్తరక్షాపరుండు

గీ. భద్రగుణనిధి దుర్గుణప్రతిభటుండు, సముఁడు నధికుండు లేనియుత్తమపరుండు
    వెదకి చూచిన శ్రీరంగవిభునివంటి, ప్రభువు నత్యంతసులభుండు పరుఁడు గలఁడె.