ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కవిజీవితములు

ప్రౌఢప్రబంధకవులచరిత్రము.

18.

సంకుసాల నృసింహకవి.

ఈవఱకును గొందఱు ప్రబంధకవులచరిత్రములు వివరించినాము. వారు ప్రౌఢకవులయినను గొన్ని భాగములలోఁ గథానుగుణ్యమున మృదుశయ్యంగూడ నవలంబించియుండుటచేత వా రుభయ విధకవు లయిరి, ఇపుడు మనము వ్రాయుచున్నకవులు కేవలము ప్రౌఢ రచనయే ప్రధానముగాఁ జేసి కవిత్వము చెప్పినవా రవుటంజేసి వీరిని బ్రౌఢకవులుగా నిర్ణయించవలసివచ్చెను. వీరిపేరులును గ్రంథముల పేరులు నీక్రింద వివరించెదను.

1. నృసింహకవి. కవికర్ణరసాయనము.

2. కృష్ణరాయలు. విష్ణుచిత్తీయము.

3. కామకవి. సత్యభామాసాంత్వనము.

4. వేంకటేశ్వరవిలాసము. గణపవరపు వేంకటపతి.

5. ధరణదేవుల రామమంత్రి. దశావతారచరిత్రము.

ఇట్టి కవుల చరిత్రములలోఁ బై యిద్దఱుకవుల చరిత్రమును బూర్వము కొంత చెప్పియున్నాను. ఇకఁ దక్కిన కవులచారిత్రము విశేషముగ వ్యాపకములో లేదుగావున గ్రంథస్థ మగుదానిమట్టుకు వివరించెదను. కృష్ణరాయనిచారిత్రములో నిదివఱ కతఁడు కవిగా వివరించి కొంతగాథయు దేశాధిపునిగా వివరించి కొంతగాథయు వ్రాసియున్నా