ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

కవి జీవితములు.

నంగీకరించి, ఆగుఱ్ఱమును విలిపించి ఆమూహూర్తముననే జగన్నాథుని దానిపై నెక్కించిరఁట. పిమ్మట జనన్నాధుఁడు మిక్కిలి సంతసించి కృ. కవికి విశేషబహుమానంబుల నిచ్చెనఁట. ఈకథనంతయు నా రాత్రి కృష్ణమూర్తికవి యున్న స్థలములోనే కూర్చుండి కృ. కవివలన నాచమత్కృతిఁ జూడఁ గోరబడినట్టియు నపు డిరువది సంవత్సరముల వయస్సులో నుండియు నిపుడేఁబది సంవత్సరముల వయస్సులో నుండునాస్నేహితు లొకరు చెప్పుటచే దీని నిందుఁ బొందుపఱిచితిని. పాఠకులు నమ్మినను నమ్మకున్నను నింతకంటె నేను వ్రాయవలసినది లేదు.

కృ. కవికృత మని వాడుకొనంబడుపద్యము.

"సీ. దురుసానిమైనున్న బురుసాపనిరుమాలు, కరసొరసమున నొక్కపరి విసర
      కురదాపడనిలీల పరదా వెడలి వచ్చు, సరదా తెలియఁ బైఁట జాఱవిడిచి
      అఱజారుకురులు క్రమ్మఱ జాఱిపడి వ్రాలు, విరజాజిపువ్వుల విసరి విసరి
      వెరబాఱుగాలి నౌపొరబాటు విడఁ మారుదరబారుపావడ దార్చి తార్చి

తే. పకడుగలకమ్మవిలుకాని హుకుమతీమ, తలబు, జాహీరుగా షక్తుతలఁపుచేయు
    దీనివక్తుతమాషాఖుషీనిషాల, ఖిలవతురభీకు నయినను దెలియ వశమె."