ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిష్టు కృష్ణమూర్తి కవి.

445

కవి శయ్యనే యవలంబించిచదువుచున్నారు. ఈ కృ. కవికిఁ గలప్రజ్ఞలలో మఱియొక గొప్పప్రజ్ఞ యేమనఁగా. ఏపురాణముఁ జదువుచున్నను ఏ రసము గలపట్టు చదువుచున్నను ఆగ్రంథ మటు నిల్పి తరువాయి గ్రంథమును స్వకపోలకల్పితముం జేయు మనఁగా నటనుండి అభాగములో నుండుశయ్యతో నారసములోనే చాలు నని చెప్పవఱకు నాశుధారను గవనము చెప్పుటయును అది చాలించి తిరుగ నటుపై నుండు కథాభాగముఁ జదువఁగా నించుకయైన శైలీభేదముగాని, రసభేదముగాని లేకుండుటయుఁ గల్గె నని అనేకపండితులు చూచి వచ్చి చెప్పిన వృత్తాంతమై యున్నది. ఈప్రజ్ఞ అసాధరణము. వసుచరిత్ర కావ్యమునకు నీపండితుఁ డెన్మిదియర్థములు చెప్పుచువచ్చె నని వాడుక గలదు. ఈకవి భళిరకవి వేల్పుశతకములోఁగొఱఁతవడియున్న పద్యములఁ బూర్తిచేసె ననియు నతనిశయ్య యాపూర్వపద్యములశయ్యతో సమానముగా నుండె ననియు నెన్నంబడును.

కృ. కవిగ్రంథవివరము.

ఈ కవియు ననేకచాటువులు చెప్పినట్లును వానివలన నాయాకృతిపతులు విశేష బహుమానాదికముం జేసినట్లును వాడుక గలదు. ప్రస్తుతములో దొరికినవఱకు దీనిలోఁ బ్రకటించెదను. ఇట్టిచాటుకవిత్వము చెప్పుటయేకాక సంగీతములోఁ గూడ ననేకకృతులును, వర్ణములును గాయకుల కుపయోగించునట్లు విశేషముగా రచియించెను. వానిలోఁ బెక్కులు కృ. కవితమ్మునికుమారులకడ జగ్గమపేఁటలో నున్నవి. గోదావరిమండలములో నుండువైణికులు పెక్కండ్రు వానిని నేర్చుకొని యున్నారు. వసుచరిత్రకారుఁ డగురామభూషణుని సంగీత సాహిత్యప్రజ్ఞ లెట్టివో ఆధునికులలోఁ గృష్ణమూర్తికవియు నట్లే యున్నవి. వీణా విషయములో నతనినాఁడు లోకోపకారకార్యములు జరిగిన ట్లీ కవినాఁడు వీణోపయోగము లగుననేకవిశేషములు చేయంబడినవి. అవి కాలాంతరమున నైన లోకములో సర్వవైణికులకు లభ్యములై విశే