ఈ పుట అచ్చుదిద్దబడ్డది

444

కవి జీవితములు.

ప్రకటించువారుగను, కృ. కవి యధికుఁ డని అతనిశిష్యవర్గముం జెప్పుకొనుస్థితిలో నుండిరి. అందుఁ గృ. కవి శిష్యులు పెక్కండ్రు వైదికశాకలోనివారును, వేంకటరామనమంత్రి శిష్యులు పెక్కండ్రు నియోగిశాఖలోని వారు నైయుండిరి. రెండవ తెగవారందఱును కోరంగి, తాళ్లరేవు, నీలపల్లి, సీతారామపుర మనుకోరంగిగ్రామ సమీపవాసులు. కృ. కవి నీలపల్లి మొదలగు స్థలములలోనికిం బోవునప్పటికి పైరంగనాథ జగనాథకవులు కృ. కవితోఁ బ్రసంగించి రనియు, నందుఁ గృష్ణక మూర్తకవికే పరాజయము కల్గె నని జగన్నాథకవివలనఁ జరిత్రకారుఁడు తెలిసికొనెను. ఆప్రసంగముయొక్క వివరమును జ్ఞాపకముంచుకొనలేకపోతి నని విచారించుచు చారిత్రకారుఁడు కృ. కవి యొక్క యితరవిశేషముల వ్రాయును.

కృ. కవి. విద్యావిశేషము.

ఈకవి యాంధ్రమునకంటెను. గీర్వాణమందు విశేషప్రజ్ఞ కలవాఁ డని చెప్పవలసియున్నది. అందు సిద్ధాంతకౌముదీ వ్యాకరణమం దీతనికి సంపూర్ణజ్ఞానము కల దని వాడుక గలదు. ఆంధ్రంబునం గూడ నసాధారణకవిత్వప్రజ్ఞ కల దని ప్రబంధకవి యగుటయే కాక ఆవఱలోఁ బ్రసిద్ధిం జెందియున్న పిండిప్రోలు. లక్ష్మణకవితో సమానుఁడ ననిపించుకోవలయు నని చేసిన విద్యాప్రసంగమువలన నతని కాలీన కవులలోఁ బెక్కండ్రకంటె నధిక ప్రజ్ఞాశాలి యని చెప్పవలసియున్నది. ఆశుకవిత్వమునకు కృ. కవి. మిగులఁ బ్రసిద్ధుండు. పురాణమును, ప్రత్యక్ష, బాహాట, పాంచాల, నటన శయ్యలఁ జదువుట యితనినాఁడే ప్రసిద్ధివడసెను. ఇతనికంటెం గొంచెము పూర్వుఁ డగువక్కలంకవీరభద్రకవి తన ప్రజ్ఞావిశేషంబు లితరులు వర్ణించినట్లు చెప్పుకొను పద్యములలోఁ

"బ్రత్యక్ష బాహాట పాంచాల నటనలఁ జదివింప నేర్పుఁదాఁ జదువనేర్చు"

నని చెప్పుకొనియుండిన నిప్పటికిఁ బ్రస్తుతములోఁ బురాణములు చదువువారందఱును సంగీత విద్యాప్రవీణుం డగు నీ కృ.