ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

433

సికొనఁ జాలము. నీవు దివాణములోని స్త్రీల కలంకారముచేయు దానవుగావున నీకుఁ దెలిసియుండును. ఈసంగతియే శాస్త్రి సందేహము తీఱుటకుం జెప్పింపఁ గోరినా నని చెప్పి పాపట ముక్కు చెవులవలెగాని లేక కనుబొమలవలెఁగాని దేవుఁడు చేసిన దా లేక నీవు తీసినదా అది మాఱుపవచ్చునా అని అడిగెను. దానికుత్తర మది మేమే తీయుదుమనియు నొకప్పుడు పాపటయిరుప్రక్కల దీసి నడుమ తమలపాకు వేసెనమనియు నభ్యంజనసమయములోఁ బాపట లేకుండఁ గలిపివేసి అనంతర మెట్టి యలంకారము కోరిన నట్టిదాని కుపయుక్త మగుపాపటఁ దీయుదు మనియుం జెప్పె. నీకుఁ దెలిసినమాత్రము శాస్త్రిగారికిఁ దెలిసియున్న గ్రంథము బాగుపడి పోవునుగదా అని చెప్పి, ల. కవి దిగ్గున లేచి మహాప్రభూ యిట్టివిశేషములు గలప్రబంధమును రచియించుటకు కృ. కవి. యే తగును. దీనిని విని మంచిచెడ్డల నిరూపించి సంతసించుట కీసభవారే తగుదురుగాక. మాబోఁ ట్లిట్టిసభలో నాహ్వానమునకుం దగి యుండరు. కావున నే నీపాటికి సెలవు గైకొనియెదను. అని చెప్పి లక్ష్మణకవి సభ వదలి బసలోకిం జనియె. అంతట రాజు కృ. కవిం జూచి ల. కవి. చెప్పినపూర్వపక్షములకు సిద్ధాంతములు విననిది యీ గ్రంథములోని తరువాయి వినఁగూడదుగావున నేఁటికి పుస్తకముఁ గట్టి సభ చాలించవలయు ననియు మఱియొకనాఁడు సభ చేసెద మనియుఁ జెప్పి ఆస్థానము చాలించి నగరులోనికిం బోయెను. పిమ్మట కృ. కవియును ఖిన్నుఁడై పుస్తకము గట్టుకొని తనబసలోనికి వెడలిపోయెను. ఇది సర్వకామదాపరిణయ వృత్తాంతము.

రాజా కొచ్చెర్లకోట వేంకటరాయమంత్రి సభకు ల. కవి పోవుట.

పైవేంకటరాయమంత్రి యొకగొప్పజమీన్‌దారుఁడు. రాజ మహేంద్రపురనివాసి. కాని మిక్కిలి భయంకరచర్యలు గలవాఁడు ఇట్టి జమీన్‌దారునిదౌష్ట్య ముడువుతలంపున లక్ష్మణకవి యొకనాఁడుబయలు