ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

423

స్త్రోక్త మగునుపాసనము, సఫలముగన్ = సార్థకముగ, ఆపరుఁడు = ఆదమ్మన్న, హృదయము సెదరి = మనస్సుచెదరి, ఆసువులఁబాసెన్ = ప్రాణముల విడచెను.

రా. శ్రీతు = ఆశ్రితుఁడగునట్టియు, సరమాకాంతుని = సరమయనుస్త్రీమగఁడగునట్టియు, బుధనుతున్ = దేవతలచేఁ గొనియాడఁబడునట్టియు, అసురవర్యు = రాక్షసశ్రేష్ఠుఁడగునట్టియు, విభీషణుని, లక్ష్మణుండు = లక్ష్మణస్వామి, రామునెఱయునానతిన్ = రామునియొక్క ప్రకటమగునాజ్ఞచేత, లంకాపతిగాఁజేసి = లంకకు రాజునుగాఁ జేసి, గభీర భాషణంబులఁబలికెన్ = గభీర వాక్యములను బల్కెను.

ల. శ్రీతు = ఆశ్రయంపఁబడినట్టియు, సరమాకాంతుని = లక్ష్మియను స్త్రీకి పెనిమిటియగునట్టియు, బుధనుతున్ = పండితులచేఁగొనియాడఁబడునట్టియు, ఆసురవర్యు = సుర శ్రేష్ఠుఁడగునట్టియు నావిష్ణునిగూర్చి, లంకాపతి = లంకభూమికి నధిపతియు, లబ్ధదివ్య తేజో బలవిరాజింతుండై = సూర్యప్రసాదముచే నొందఁబడిన దివ్య తేజముచే బలముచేఁ బ్రకాశింపఁబడినవాఁడై, ఆత్మీయామోఘగోశక్తి ప్రకటంబగునట్లుగా విజృంభించిన, తనసంబంధ మగువ్యర్థము కానివాక్యసామర్థ్యము ప్రకట మగునట్లు విజృంభించిన.

రా, సూర్యుఁడు చంద్రుఁడు నక్షత్రములు భూమి రామునికథయును, నెన్ని దినంబు లుండునో యన్నిదినములును శత్రుభయ విరహితముగా దానవనాథుఁడ వగునోవిభీషణుఁడా లంక నేలుమిఁకన్ = ఇంతటనుండి లంకాపురిని బాలింపుము.

ల. దానవనాథవిభీషణా = రాక్షసశ్రేష్ఠులకు మిగుల భయంకరుఁడ వైనట్టి యోస్వామీ, లంక = లంకపొలమును, ఏలుమిఁకన్ = ఇఁక పరిపాలింపుమా (శేషమొకటే రీతి యని గ్రహింపవలయును.)

ఇ ట్లింతవఱకును లక్ష్మణకవిచరిత్రమును గ్రంథస్థ మైనదానిని వివరించి యున్నాను. ఇఁక వ్రాయఁబోవుచారిత్రము గ్రంథస్థము కానిదైయుండును.