ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

417

రా. ఓపికవాణీ = కోకిలపలుకులవంటి పలుకులు గల ఓసీతా, నేను, రచనానైపుణి = కల్పనాచమత్కారము, నీమదికిన్ = నీయుల్లమునకు, ఒప్పి = ఇష్టమై, నాటుకొనంగన్ = నీపతితత్వంబు నీపతియొక్క నిజమును. వ్యాపకతన్ = చెందునట్లు, వర్ణించెదన్.

ల. ఓదమ్మన్నా నేను, ఓపికన్ = ఓపికచేత, నీమదికిన్ = నీమనస్సునకు, నొప్పి = ఆయాసము, నాటుకొనంగన్ = నాటుకొనునట్లు, నీపతితత్వంబు = నీపాపాత్ముఁడౌటను, ప్యాపకతన్ = వ్యాపకత్వమును, చెందునట్లు, వర్ణించెదన్ = వర్ణింతును.

రా. లంకనేల = ఈద్వీపము, కొలన్ = యుద్ధమందు ముల్లోకంబులెఱుఁగన్, ఏడుపున్ = రోదనమును. అందున్ = పొందును, లంకలోనున్న జనులు రోదనము చేతురనుట, ఇది అజహత్స్వార్థ యనులక్షణ. పరక్షేత్రాప్తి = పరునిభార్యను పట్టుట, మేలు కాదు, అభూమిజాతన్ = సీతను, ప్రీతితోడ, వీడుము. భారతప్రమాణము. - "క. పరదారగమన మొప్పదు, పురుషుల కది యెల్లపాపములకంటె నరే, శ్వర పరమాయుస్సంక్షయ, కరంబు తద్వర్జనంబు కడు మే లరయన్."

ల. లంకనేలకొల = లంకనేలయొక్క ప్రమాణము, లోకంబులెఱుఁగన్, ఏడుపందుముల్ = మూఁడుపుట్లపందుము, పరక్షేత్రాప్తి = పరునిమాన్యముగొనుట, మేలుకాదు, పేర్మిన్ = ఇష్టముగా, నాభూమిన్ = నామాన్యమును, జాతసంప్రీతితోడన్ = పుట్టిన సంతోషముతో, వీడుము = విడిచి పెట్టుము, అదియె = ఆ యిచ్చుటె. ఇచ్చున్.

రా. జ్యేష్ఠుఁడా = రావణా, లక్ష్మణాగ్రజక్షేత్రము = రాముని భార్యను, ఈవు = నీవు, వదలకుండుట, మోసంబు = కార్యకారణముల కభేదము, ఇంకన్, చండ = యమభటుల వంటియు, ని. "చండో దైత్యవిశేషే యమదాసే త్రిషు తు తీవ్రకోపనయోః." నిర్భీక = భయములేనట్టి వనచారి = వానరములయొక్క, పిండి = సమూహము, ప్రోలికిన్ = ఈద్వీపమునకు వచ్చున్ = ఏ తెంచును, అవి సూర్యునియొక్క, ని. "అవి శ్శైలే