ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

411

"గీ. జ్యేష్ఠుఁడా లక్ష్మణాగ్రజక్షేత్రమీవు, వదలకుండిన మోసంబు వచ్చు నింక
     చండనిర్భీకవనచారి పిండిప్రోలి, కవికులవరుతో రిపుత ముఖ్యముగ వలదు."

అట్లుగా వలదనుట కీక్రిందికారణములఁ జెప్పుచున్నాఁడు ఎట్లన్నను :-

"సీ. లలి భూతలంబునం దెలుఁగులరాజాంబ, వత్సమాఖ్యప్రసిద్ధి వరలెడునిపు
      ణుండు వాగనుశాసనుఁడు తిమ్మఁడొకఁడు, ధూర్జటిరామలింగసంజ్ఞాప్రధితుఁడు
      బుధవరుల్ భాస్కరపోతనలాదిక, వనచారులు మఱియు ననుపమాన
      కృతిరామభద్రుఁడు శ్రీనాథుఁడు గణింపఁ, దత్సముల్ దధికులు ధరణి లేరు

తే. కళల సోముఁడు పెద్దన్న కరణి వెలయు, చుండు రెండవవీరుండనూనమతిని
    రూపణము సేయకుండలీంద్రుండు సుమ్ము, లక్ష్మణాఖ్యుఁడు గాన చలంబు విడువు."

ఇఁక సంస్కృతకవులతో నీతనిం బోల్చి చెప్పిన పద్యమును తెలియఁదగినదే. ఎట్లన్నను :-

"ఉ. భాణుని, భారవిన్, ఘనసుబంధుని, నాభవభూతి, సర్వగీ
      ర్వాణపదంబులన్ గొనినవారిఁ దదన్యుల విందుమే కదా
      క్షోణిని వారికన్న మతిసూక్ష్ముఁ డవారణవిద్య నిన్ను ని
      ష్ప్రాణునిఁ జేయు నాఁతఁ డరయన్ బురుషోత్తముఁ డౌకతంబునన్.

అని యున్నది. ఈపద్యములో లక్ష్మణకవి శ్లేషనైపుణ్యముం జూపుటయేగాక తనకవిత్వప్రజ్ఞయు విశేషించి చూపెను.

ఇటులనే మఱికొన్నిపద్యములు చెప్పి లక్ష్మణకవి రామాయణ యుద్ధమును తనవివాదసమాప్తియు నీక్రింది గద్యపద్యములలోఁ జూపు చున్నాఁడు. లక్ష్మణకవియొక్క యితరచర్యలు చూపుట కీగాథ యడ్డగించుచున్నది కావున దీనిని ముందుగ ముగించెదను. ఎట్లన్నను :-

"వ. తదనంతరంబ నిజవిజయంబు గోరుచుఁ బయలుదేఱినయాలంకాధిపతి పటుతరగోశక్తి హరిబలంబున దృఢత గలయంగదాదుల లీల నాక్రమించి సుదర్శన హస్తనాభివత్సజఘనదృఢత్వం బడంచుచుఁ, బృధు జంఘాతిశయబలంబుఁ ద్రుంచుచు సుబాహు గంధవహాత్మజానుతాపంబొనరించుచు, నీలతార కోపస్థితి విఫలంబుచేయుచు, సుముఖ సుగ్రీవాదులకు వివర్ణతం బుట్టింపుచుం జేరియున్న రసమాజవర్యు నొక్కింత వివశత నొందింప నాలక్ష్మణాగ్రజుం డంత ముఖ్యశత్రు వధార్థఁబుగా ననుపమానా