ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

389

బట్టుమూర్తి తిమ్మ రసుపైఁ గోపించుట

ఇదివఱలో నేను వివరించియున్న మోదుకూరి కాఁపురస్థులగు భట్రాజులు "ద్వాత్రింశన్మంత్రులచరిత్రము" అనుగ్రంథములో నీభట్టుమూర్తిప్రతాప మున్నట్లుగాఁ జెప్పి దానిని సూచించుటకుఁగాను ఈగ్రంథమంతయుఁ బిఠాపురములోనుండు బ్ర. పెద్దాడ. చిట్టిరామయ్యనాము లగునామాతామహజ్ఞాతుల కొసంగిరి. దానిని వా రచ్చు వేయించి ప్రకటించిరి. అందులో నీభట్టుమూర్తిప్రతాప మున్నను అది ద్వాత్రింశన్మంత్రి ప్రతాపములున్నట్లు మనదేశములో మిక్కిలి విఖ్యాతి నందిన కృష్ణదేవరాయసార్వభౌముని ప్రసిద్ధప్రధానమంత్రి యగుతిమ్మరసుమంత్రిప్రతాప మందు లేదుగావున నందలిభట్టుమూర్తికథలు కల్పితములని యూహించవలసియున్నది. తిమ్మరసు వృత్తాంతము వేఱుచారిత్రముగా వ్రాసియుంటినిగనుక నిపు డీమంత్రిచరిత్రములో వ్రాయంబడిన భట్టుమూర్తి ప్రతాపమునే యిందుఁ బొందుపఱిచెదను. "కథకు కాళ్లును, ముంతకుఁ జెవులును లే" వని యున్నది. గావున పుక్కిటిపురాణము లెవరి వెవరి కదికిన నదుకవచ్చును. కావున నే నీవఱకు రామలింగముచరిత్రములోఁ జెప్పినభట్టుమూర్తిపద్యము రామలింగముపద్యమని చెప్పెడుదానికి సంశయింపం బనిలేదు. ఏదియైన నున్న నది పాఠాంతర మని యూహించుట మంచిది. అదియెట్లున్న దనఁగా :-

21 మంత్రి యగుతిమ్మరసుకథ.

"భట్టుమూర్తికి కిన్క రెట్టింప పచ్చలహార మర్పించె తిమ్మరసుమౌళి."

ఈయన రాయలవారియొద్ద ముఖ్యప్రథానుఁడు. తిమ్మర సనుపేరుగలవాఁడు. బహుబుద్ధిశాలి. ఈయనను రాయలు బితృసముఁ డని యప్పాజీ యని పిలుచుంగావున నప్పాజీ యనియుంగూడ నామంబు గలదు. ఈయన సర్వాధ్యక్షుండుగా రాయలవారియొద్ద నుండునపుడు భట్టుమూర్తి యెన్నండును కైవారంబు సేయకుండుటచే మనంబున నించుక మత్సరంబు గలవాఁడై యుండి యాకవికి నెప్పుడు వంచనము గావించెద