ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

కవి జీవితములు

ఇఁక దక్షిణదేశములోని వీణె నచలటాటు (అనఁగా నచలమేళనము) చేయుపని నవలంబించవలసివచ్చినది. అట్టిపని చేయుటకు నావిద్యలో సంపూర్ణ పాండిత్యము గలవారు యత్నింపవలసివచ్చును. ఆపనికై రామభూషణునికాలము వఱకును యత్నించినవా రేరును గానుపించలేదు. పిమ్మట రామభూషణు డట్టికార్యముఁ జేయంబూనుకొనియెను. అందాఁకను చేసినపని యెట్లున్న దనఁగా, ఉత్తరదేశీయు లిరువదిమెట్లు కల్పించినదానికి నింకొకనాల్గుమె ట్లధికముగా వేసెను. అనఁగా రెండుగాంధారములును, రెండుఋషభములను నధికముగాఁ జేసెను. దీనింబట్టి యీవీణెకు నిరువదినాల్గు (24) మెట్లేర్పడినవి. అనఁగా మొదటఁ జెప్పియున్న పండ్రెండుస్వరములును రెండావృత్తములు తిరిగినవి. ఇ ట్లుండటంజేసి యుత్తరదేశీయుల అచలటాట్ కంటెను దక్షిణదేశీయులఅచలటాట్ సులభమార్గమైనది. కావున సరస్వతి వీణ యగు కచ్ఛపి పండ్రెండేసి మెట్లు గలరెండుస్థాయులు కలదిగా రామరాజభూషణకవివలనఁ జేయంబడినది. దాని కనుగుణముగ రాగాలాపములు సరిపుచ్చవచ్చును.

సంగీత శాస్త్రముం దెల్పుపద్యములు.

వసుచరిత్రములో సంగీతసంప్రదాయముం దెల్పుపద్యములు పెక్కు లున్నవి. అందుఁ గొన్నిటిని పైయుపన్యాసార్థము వివరించెదను. ఇదివఱలో వివరింపఁబడినవి తిరుగ వివరింపఁబడవలసిన యవసరము లేదు గావున వానిని వదలివేసెదను. తక్కిన వెట్లనఁగా :-

"మ. సకలామోదకతాళవృత్తగతులన్ సంగీతసాహిత్యనా
       మకవిద్యాయుగళంబు పల్కుఁజెలికిం బాలిండ్లజో డై సిరుల్
       ప్రకటింపన్ నఖరేఖలందు నలఘుప్రస్తారము ల్సేయుస
       ర్వకళాకాంతుడు బ్రోవుతం దిరుమలేంద్రశ్రీమహారాయనిన్."
                                                     వసు. అశ్వా 1. పద్య 3.

"చ. అన నిని కేళికాసచివుఁ డాస్వన మల్లన నాలకించి యో
      జనవర పల్లకీరవము సంగతిఁ బాడెద రెవ్వరో వినూ