ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

కవి జీవితములు

అట్టివానికి నెంతయు నలరియుఁ గథాకల్పనలోఁ జేసియున్నకొన్నిసందర్భములకుఁ గాఁ గల్గియున్న శంకల నిట వివరింపకున్న యెడల విమర్శనకు లోప మని యట్టివానిలోనిలోపము లఁ గొన్నిటి నిట వివరించెదను. అయితే యీగ్రంథమందు విశేషాభిమానము గలవార లట్టిశంకలయెడల నాదర ముంచి యథార్థ మరయఁ గోరెదను.

నారదమునికిని తుంబురునకును సంగీతవిద్యలో వివాదము కల్గె ననియు, నపుడు నారదుండు తుంబురుని జయించుటకుగాను గానవిద్యా విశేషంబులు నేర్చుకొనుటకై ద్వారకాపట్టణంబునకుఁ బోవ శ్రీకృష్ణుం డాతనిం దోడ్కొని తనభార్యలలో నొక్కతె యగుజాంబవతి కొప్పింప నాపెకడ నారదుం డొకవత్సరంబు గానంబె నేర్చికొనె ననియును; పిమ్మట నారదుండు శ్రీకృష్ణనియుక్తుండై సత్యారుక్మిణులకడ నొక్కొక్కవత్సరంబు గానవిద్య నభ్యసించె ననియును మణిమందరుండును, కలభాషిణి నారదునివలె నంతఃపురకాంతలవలన సంగీతశిక్ష లేకయుండియు శ్రీకృష్ణుని యనుగ్రహంబున సకలసంగీతకళారహస్యంబులం గ్రహించి రని చెప్పంబడినది. లోకములో సంగీతవర్ణనముఁ జేయుచో నందు నారదునియట్టి ప్రజ్ఞగలవా రని చెప్పుటయే అత్యుక్తి. నారదుఁడును నేర్చుకోఁ దగినసంగీత మని చెప్పుట అత్యుక్తికి పైది. అదియునుగాక నారదుఁడు వచ్చి శ్రీకృష్ణునిభార్యలకడ మూఁడుసంవత్సరములు విద్య నేర్చుకొనియె నని చెప్పుటయు నంతదనుక అతని శిష్యుం డగుమణికంధరుండు రాణివాసంబు ద్వారంబుననే నిల్చియుండె ననియు నిట్లున్న మణికంధరుఁడు శ్రీకృష్ణునియనుగ్రహంబున నొక్క పెట్టున సకలసంగీతరహస్యంబులు నేర్చుకొని నారదునితో సమానుఁ డయ్యె నని చేసినకల్పన యత్యుక్తికింగూడ మించినదై భక్తాగ్రగణ్యుఁ డైననారదుండు సంపాదింపలేని శ్రీకృష్ణసంబంధ మగుసంగీత విద్యను నారదశిష్యుఁడుగాఁగల్పింపఁబడినమణికంధరుఁడు శ్రీకృష్ణుని నిర్హేతుకజాయమాన కటాక్షమునకు పాత్రుఁడై యొక్కమాఱుగ గ్రహించె