ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

347

మాయెఁ గావున వేఱుగఁ బ్రకటించెదను. అపు డందులకథాసందర్భములోని పూర్వపక్షముల విస్తరించి చూపెదను. ఇపు డిందు నేనందులఁ గనిపట్టిన లోకములలోఁ గొన్నిటినిమాత్రమువివరించెదను, దానికి ముందుగ కవిత్వశయ్యాదులలో నీకవిచమత్కృతిం జూపు నొకటిరెండు పద్యములం జూపెదను ఒక ముదుసలి స్త్రీని వర్ణించిన పద్యము.

సీ. పసిమి పో సెండినకసవుబట్టయుఁబోలె, నెఱవెండ్రుకలఁ బర్వుశిరమువలన
    నులిగొన్న చెలఁదిపుర్వులనూలివళ్లునా, నమరెడుముడుతకన్బొమలవలనఁ
    గడుఁ జిట్టినట్టిబంగరుపోఁతపొక్కిళ్ల, వడువుఁ జూపెడుమేనివళులవలనఁ
    దునిసివ్రేలెడుమ్రాఁకుతునుకల వలపించు, బాహువక్షోజలంబనమువలనఁ

తే. ఘూకరవములచాడ్పున ఘోరవృత్తిఁ, దనరుఘనకాసకుహికుహిధ్వనులవలన
    భావజుఁడు వెళ్లిపోయినపాడుమేడ, పగిదిఁ గాన్పించు ముదుసలిపడఁతియొక తె.
                                                              కళాపూర్ణో. ఆశ్వా 3 ప 84.

ఈముదుసలి నే తిరుగ నింకొకపరి శాపవిమోచనానంతరము యౌవనప్రాదుర్భావము నందిన స్త్రీనిగాని వర్ణించె.

సీ. నిండుచందురు నవ్వు నెమ్మోముసిరితోడ, నిరులు గ్రమ్మెడువేణిభరముతోడ
    నాకర్ణలోలంబు లగునేత్రములతోడఁ, దళుకొత్తు చెక్కుటద్దములతోడ
    మిగుల మిటారించుబిగిచనుంగవతోడ, లలితంపుబాహువల్లరులతోడ
    నతికృశత్వమున జవ్వాడుమధ్యముతోడ, నభినవం బైననూఁగారుతోడఁ

తే. వలువమీఁదికిఁ దొలఁకు సువర్ణపులిన, గురునితంబప్రభాపరంపరలతోడ
    మహితసర్వాంగలావణ్యమహిమతోడ, నమరుప్రాయంపురూపుచిత్రముగఁదాల్చె.
                                                                  కళా. ఆశ్వా, 3. ప. 122.

ఈసందర్భములోఁ బైముదుసలియువతియొక్క వర్ణనము మిక్కిలి కఠినమైనపని. సాధారణముగ శృంగారవర్ణనమే అందఱు చేయుదురు గాని తద్వ్యతిరేకముగా వర్ణించుటకుఁ గవులు యత్నింపరు. సూరకవి అట్టివర్ణనమును స్వభావోక్తితోఁ జేయుటయే కాక తిరుగ నా స్త్రీనే రూపాంత మందఁగా వర్ణించుటయు నందు రసము స్వాభావికమైనది తెచ్చుటయు వర్ణనీయము. ఇటులనే సూరకవి తనకుఁ గలవర్ణానావిశేషము లోనిప్రజ్ఞ నగపఱిచిన పద్యములనేకము లీగ్రంథములోఁజూపెను.