ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

23



దీసివేయఁగా నూటయెనిమిదింటికి నెన్ని యున్న వో యవి పూర్వము వలెనే యెనిమిదింట భాగింపఁగా శేష మెన్ని యంకె లున్నవియో యాయం కెలకు సూర్యుఁడు మొదలు క్రమముగా గ్రహములను నిర్ణయించి మొదటఁ దలఁచుకొనినశేష మంకెలలో నొకటి తీసివేసి మిగిలిన యంకె లెనిమిదింట హెచ్చ గుణించి యందులో రెండవమా ఱడిగిన యం కెల శేషము కలిపిన నెన్నియగుచున్నవో యన్న వశ్లోకములో వచ్చినగ్రహత్రయమును దెలిసికొని శుభాశుభఫలములు చెప్పెడు నిర్ణయము. ప్రథమోక్తాంకశేషము మొదటిగ్రహమునుబట్టి తెలిసికొనవలయును. అందులో నొకటి తీసి వేసి శేషము 8 చే హెచ్చ గుణించి యా హెచ్చగుణించినసంక్యలో 2 గ్రహసంఖ్య కూడఁ గలిపిన నఱువదినాలుగు అంకెలలో నన్నవశ్లోకము చూచుకొనిన నేగ్రహ క్రమము వచ్చునో యాశ్లోకములో నున్నమంచిచెడ్డ లాప్రశ్నకు ఫలముగాఁ జెప్పునది. "అద్యోక్తాంకస్య శేషంతు" అనుదానికి నర్థము. ఎనిమిదియంకెలు తలఁచుకొని రాహువు మొదటిగ్రహ మయినపక్షమునకు నెనిమిదింటిలోఁ దీసి వేసి యేడును నెనిమిదింట హెచ్చ గుణించి రెండవగ్రహసంఖ్య కలుపుకొనవలయును. తొమ్మిదియంకెలు తలఁచు కొనిన రవి మొదటిగ్రహ మగునే నొకటి తీసి వేసి శేషము లేదు గనుక హెచ్చ గుణించుట యక్కఱలేదు. రెండవగ్రహసంఖ్యశ్లోకము నే చూచుకొనవలయును. శ్లోకములఫలము మొదటినుండియుఁ జెప్పెదను. మేకిమేకీమేకిమేకీమెమెమేకీదశైవమే, కిమెమేకీచషణ్మేకీకిమెమేక్యష్టమేకిమే, కీకీమెమెకిమే మేకీషణ్మేమేకీకిమేత్యపి, చతుష్షష్ట్యాత్మకశ్లోక ఫల మేవం ప్రకీర్తితమ్.


శ్లో. రవౌ షట్చ ద్వాదశ చ త్రివింశష్షడ్విగ్ంశతిః, త్రయస్త్రింశచ్చతుస్త్రింశ త్సప్తత్రింశదథోచ్యతే. షడష్టనవచత్వారింశ ద్ద్విపంచాశద్ద్విషష్టికమ్,యఃపం చదశకం శ్లోకం భీమోక్త గ్రంథతత్వగమ్, ఆదిత్యార్క సుధాంశు శ్చేద్విజయశ్శ్రీసమాగమః, ఈప్సితం సుఖసంపత్తిః కల్పవృక్షప్రదర్శనాత్. 1. భానుచంద్రార్కయుక్త శ్చే ద్విదేశగమనం భవేత్, బంధువర్గజనై ర్వేష శ్శాంతివృక్ష ప్రదర్శనాత్. 2. అర్కాంగారాహియుక్తా శ్చేత్స్వస్థానే పూజ్యతే సదా,