ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

కవి జీవితములు

స భూపతి ర్మహతేజా యయౌ చన్ద్రగిరిం ప్రతి,
గురుం తాతార్య మాదాయ రామరాయాభి ధ స్తదా,
..................................................................
రామరాయసహాయేన మహాచార్యో మహాయశాః,
దుర్జయా నపి నిర్జిత్య శైవాన్ శాస్త్రవిదుత్తమః,
.........................................................
శైవశాస్త్ర విదాం శ్రేష్ఠో ధీమా నప్పయదీక్షితః,
చిత్రకూటే జితారాతి రశోభత మహాయశాః,
అద్వైతదీపికాభిఖ్యం గ్రస్థ మప్పయదీక్షితః,
చకార భగవద్ద్వేషీ శైవధర్మరత స్సదా,
మహాచార్య స్స తాం శ్రుత్వా తస్య ప్ర తిభటం తదా,
చండమారుతనామానం విదధే గ్రంథ ముత్తమమ్."

అని యున్నది.

దీనింబట్టి గూడ నృసింహాచార్యులకు నప్పయ్యదీక్షిత కాలీనుఁడును చండమారుతగ్రంథకర్తయు నగుతాతాచార్యులకు నడుమ 7 (ఏడ్గురు) పురుషు లున్నారు. అందుతాతాచార్యనాములు మఱియిర్వురు కానుపించుచున్నారు. శ్రీనివాసాచార్యనాము లిర్వురు రున్నారు. అందు నంద్యాలకృష్ణమరాజుకాలీనుఁడు పై పద్యానుసారముగఁ గృష్ణదేవరాయానంతరము వచ్చినరామరాజునకు గురు వని చెప్పఁబడినతాతాచార్యులతండ్రి యగు శ్రీనివాసాచార్యు లై యున్నాఁడు. అందు విశ్రుతుఁ డగుతాతాచార్యు లని యుండుటచేతను అతనియన్వయమందుఁ బుట్టిన సుదర్శనాచార్యు లని యుండుటచేతను ఆతాతాచార్యులు నృసింహాచార్యులకుమారుఁ డగుతాతాచార్యులు కావచ్చునని తోఁచుచున్నది. అట్లు కానిచో నతని మనుమఁ డగుతాతాచార్యు లైనను కావచ్చును. ఎటులైనను తాతాచార్యవంశస్థుఁడు సుదర్శనాచార్యులు గావచ్చును. అతనికుమారుఁ డగుశ్రీనివాసాచార్యులు నంద్యాలకృష్ణమరాజును సమకాలీను లగుటకు సందియము లేదు. పింగళిసూరన కృష్ణమరాజు కాలీనుఁడు గనుక పై శ్రీనివాసాచార్యులకాలీనుఁ డగుటకు సంశయ ముండఁగూడదు. ఒక వేళ శ్రీనివాసాచార్యులు విశే