ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

299

నంత నావెండ్రుకం గొని నిప్పుసెగ చూపి సరిచేయంబోవ నది చూర్ణముకాఁగాని ట్లొకవెండ్రుక చెడుటకు భయపడి, అన్నియు నట్లే చెడు నని పేకి విచారించి చెప్పినపని పూర్తిచేయనిది తనప్రభువులకడకుం బోయినఁ బ్రతిజ్ఞాభంగ మగునని యెంచి తిరుగ వారలకుఁ గాన్పించకుండఁ బలాయిత యయ్యెను." అని, యొకకథ గలదు.

పైకథ యంతయు నాలోచింపగా నిది చమత్కారార్థము కల్పించఁబడియుండునుగాని యధార్థము కా దని తోఁ చెడిని. అయినను లోకములోనివాడుకనుగూడ మనము తెలియఁ జేసినాము. దేని నెట్లు గైకొనవలయునో బుద్ధిమంతులు దాని నట్లే కైకొనియెదరుగాక. ఈపేకివృత్తాంతము చెప్పితిమి కావున నిఁక గోకనమంత్రిచరిత్రము ముగింపము. అయితే పైపద్యములో "నెరపె గోపకుమారుని ఖడ్గవర్ణనము"అను కథ మాత్రము చెప్పవలసియున్నది. దీనిం బట్టిచూడ నీగోకనమంత్రి కవిత్వమునందును ప్రజ్ఞ కలవాఁ డని నిశ్చయించి చెప్పవలసియున్నది. అతని కవిత్వవిశేషములు సూరకవికే తెలిసియుండక పోవచ్చును ఇఁక మన కెట్లు తెలియఁగలవు. కావున నావృత్తాంతము వ్రాయఁజాలము.

గోకనమంత్రి వంశలోని సూరకవిశాఖ.

పైగోకమంత్రి వంశస్థు లనేక శాఖలైరి. వారిలోగంగయమంత్రి నుండి సూరకవిశాఖ విభజింపఁబడినది. ఈగంగయమంత్రికి బంగరుకామ, గలకుంచెలు, పల్లకి మొదలగు సర్వాంగసమృద్ధితో నొప్పురాజ్యలక్ష్మి సంప్రాప్తమయ్యె నని కలదు. అందుల కారణము వ్రాయంజాలము. గంగమంత్రి మనుమనికుమారుం డగుసూరయకవియును, శివభక్తిపరాయణుఁ డైన ట్లీక్రిందపద్యమువలనం గాన్పించు.

క. వారలకు నగ్రజుం డగు, సూరయ సూరప్రభుండు సుకవిత్వసదా,
    చార శివభక్తి, విన యో దారత్వాదులఁ బ్రసిద్ధతముఁ డై మించెన్.

సూరన కుమారుం డగునమరన మంత్రి కుమారుఁడు మనచరిత్రకుఁ బ్రధానుఁ డగుసూరకవి. ఇతఁడు తనతాత యగుసూరకవి ప్రతి