ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కవి జీవితములు

గాంధర్వవిద్యలు. దీని వశపర్చుకొనినవారికెల్ల వైహికసుఖములు లభియింపఁ గలవనియును, ఆముష్మికవిద్యల కివి నిరోధకము లనియు మంత్ర శాస్త్రజ్ఞుల యభిప్రాయము. ఈవిధ మగువిద్య నొకదానిని గోకమంత్రి వశపఱుచుకొనె నని సామాన్యముగాఁ జెప్పంబడక

"పేకి యనుదానిని దాసి గ నేలె యోగి తా గుర్వనుభావుఁ డై"

అనియుండుటచేత గోకమంత్రి యోగియై యీగంధర్వ స్త్రీని దాసిగఁ జేసె నని చెప్పియుండుటచే లోకములో వాడుకగా నుండు మఱియొకకథ మాంత్రికులు వాడుకొనునదియే యీ పేకికథ యేమో యని తలంచెదను. ఆకథలోని విశేషము లేవియనఁగా, ఒకగంధర్వ విద్య నొకమాంత్రికుఁడు ప్రత్యక్షముచేసికొనియె ననియును, ఆవిద్య వలన నైహికసౌఖ్యముల నన్నిటి నంది తనకు నామూష్మికసుఖమును గల్గింపవలయునని యాగంధర్విని గోరఁగా నట్లేచేసెదనిన చెప్పి మాంత్రికుని మరణకాలములో వియద్గమనమున నెత్తుకొనిపోయి కాశిలో గంగాతీరమం దాతని నుంచె ననియు నామాంత్రికుఁ డవిముక్త క్షేత్రమున మరణము నందుటం జేసి ముక్తుఁ డయ్యె ననియుం గలదు. ఇఁకఁ బామరజనసాధారణకథను వివరించెదను.

పింగళి వారి పేకికథకు మఱియొక యనువాదము.

దానింగూర్చి యిప్పుడును వాడుకలోనున్న కథను వివరించెదను. ఇక్కథ యెన్నివిధములచేత వదిలించుకొనినను వదలనిమనుష్యులవిషయమై పింగళివారిపేకి వలె పట్టుకొనిన వదలఁ డని చెప్పెడునొక సామెత యయినది. దీనికి వాడుకలోఁ గలకథ యెట్లనఁగా :-

ఒకబ్రాహ్మణుఁడును అతనిభార్యయును గారణాంతరమున దేశాంతరమున నుండిరనియును. అపు డాబ్రాహ్మణుని భార్యకు పరిచారిక యొకతె కావలసివచ్చె ననియు అందుకుగాను ప్రయత్నము చేయుచుండ నీపేకి యనునది యొక స్త్రీవేషము వేసికొని తాను