ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

283

కొంచెము తెలిసియుంట మంచి దని విన్న వించెదను. లోకములో నెట్టి మూర్ఖుఁడైననుదాను జేసినతప్పులనుబైటఁ బెట్టికొనఁడు. అట్టిచో శ్రీనాథునివంటిమహాప్రాజ్ఞుఁడు లోకములో నందఱిచేతను గర్హి తమగునట్టి వర్ణనలు తనపయిం బెట్టికొని ప్రకటించునా? అట్లుగా నతఁడు చెప్పియున్నను, అతని కాప్తులుగా నుండువారు నివారింపరా! కాఁబట్టి పైగ్రంథమును శ్రీనాథుఁడు స్వకామపూరణార్థముగానీ, కామప్రకటనార్థముగానీ చెప్పినట్లూహింపఁదగదు. ఇఁక నీ గ్రంథరచనమున కేమి కారణ ముండు నని యూహింపవలసి యున్నది. దాని నీక్రింద వివరించెదను.

నాటకములు పదివిధములుగా నుండును. అందు వీథి యనునది యొకనాటకభేదము. ఎట్లన్నను - ప్రతాపరుద్రీయము.

శ్లో. నాటకం సప్రకరణం భాణః ప్రహసనం డిమః,
    వ్యాయోగ సమవాకారౌ వీ థ్యం కేహామృగా దశ.

శ్రీనాథకృతనాటకమునకు వీథి యనునాటకలక్షణము పట్టును. ఇట్టిచో నిది శ్రీనాథునివలన వీథిలో నాడుటకు నేర్పఱుపఁ బడిన ట్లూహింపఁగూడదు. ఈవీథినాటకములో నొకవిటుఁడు తనకుఁ గలలో కాను భవమును దనమిత్రునితోఁ జెప్పినట్లుగా వ్రాయంబడెను. అంతమాత్రమున వానిలోనియభిప్రాయానుసారముగ శ్రీనాథుఁడు తననే యుద్దేశించి చెప్పిన ట్లూహించుట పొరపాటు. ఈనాటకములో నుద్దేశింపఁబడిన స్థలములు రెండుమూఁడు గలవు. అందు నాంధ్రదేశములో నుత్తరముగా నుండుసింహాచలదేవస్థాన మొకటి. ఆంధ్రదేశములో దక్షిణమున నుండు నద్దంకిపట్టణ మొకటి. దానికిని దక్షిణముగా నుండుశ్రీరంగ దివ్యస్థానము మూఁడవది. తీర్థవాసులు దివ్యస్థలములకు వచ్చుట సహజముగనుక కథానాయకుఁ డిటువంటిచోట్లు వచ్చిన స్త్రీలను వర్ణించుచున్నాఁడు. సింహాచలము నాటకరంగ మైనందులకుఁ బ్రమాణము.

"సీ. హరినీలములకొప్పు లణఁగించునునుకొప్పు, విరిపువ్వదండతా వీఁగఁబాఱఁ
      గోటిచందురుడాలు కొనివేయఁగాఁ జాలు, మొగముకుంకుమచుక్క సొగసుగుల్క
      అలజక్కవలచిక్కు లణఁగద్రొక్కఁగ నిక్కు, పాలిండ్లపై నాఁచుపైఁట జాఱ
      నిసుకతిన్నెలమెట్టి పసిఁడిచెంపలఁ గొట్టు, పిఱుఁదుపై మొలనూలు బెళుకుడేర