ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

265

"వ. నవరసభావానుబంధబంధురంబుగా నే నొక్కప్రబంధంబు నిర్మింపందలంచి కౌతూహలాధీనమానసుండనై యిమ్మహాప్రబంధప్రారంభంబునకుం దగినపుణ్యశ్లోకపు రాతనమహారాజచరిత్రం బెయ్యదియొకో యని వితర్కించుచున్న సమయంబున.

సీ. తనకృపాణము సముద్ధతవైరిశుద్థాంత, తాటంకముల కెగ్గు దలఁపుచుండఁ
    దనబాహుపీఠంబు ధరణిభృత్కమఠాహి, సామజంబులకు విశ్రాంతి యొసఁగఁ
    దనకీర్తినర్తకి ఘనతరబ్రహ్మాండ, భవనభూముల గొండ్లిఁ బరిఢవిల్లఁ
    దనదానమహిమ సంతానచింతారత్న, జీమూతసురభుల సిగ్గుపఱుపఁ

గీ. బరఁగుశ్రీవేమమండలేశ్వరునిమంత్రి, యహితదుర్మంత్రివదనముద్రావతార
    శాసనుఁడు రాయవేశ్యాభుజంగబిరుదు, మంత్రిపెద్దయసింగ నామాత్యవరుఁడు.

వ. మృధుమధురచిత్రవిస్తారకవితావిలాసవాగీశ్వరు లగుకవీశ్వరులును, పతంజలి, కణాద, అక్షచరణ, పక్షిలాదిశాస్త్రసిద్ధాంతక మలవనహంసు లగువిద్వాంసులును, భరతమతంగదత్తిళ, కోహళాంజనేయప్రణీత సంగీతవిద్యారహస్యవిజ్ఞానవైజ్ఞానిక స్వాంతు లగు కళావంతులును, శక్తిత్రయ, చతురుపాయ, షాడ్గుణ్య ప్రయోగయోగ్యవిచారు లగురాయబారులును, నిఖిలపురాణేతిహాససంహితాతాత్పర్యపర్యాలోచనా ధురంధరధిషణాస ముత్సాహం బగుపౌరాణిక సమూహంబును బరివేష్టింపం గొలువుండి, సరసవిద్యాపారంగతుండు సరససాహిత్యగోష్ఠివి నోదప్రసంగంబున :-

శా. భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి
     ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకుం
     గారా మైనతనూజు న న్న నఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
     త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ప్రౌఢిమన్.
     ...........................................................................

వ. కావున నాకు నొక్కప్రబంధంబు పుణ్యశ్లోకపురాతనరాజర్షి చరితానుబంధ బంధురంబుగా రచియింపుము. అందు :-

గీ. భట్టహర్షుండు ప్రౌఢవాక్పాటవమున, నెద్ది రచియించి బుధలోకహితముఁ బొందె
    నట్టినైషధసత్కావ్య మాంధ్రభాష, ననఘ యొనరింపు నాపేర నంకితముగ.

వ. అని పల్కి సబహుమానంబుగఁ గర్పూరతాంబూలం బొసంగి జాంబూన దాంబరాభరణంబులు గట్ట నిచ్చి వీడ్కొలిపిన, నేను నమ్మహాప్రధానునిం గృతినాయకుం జేసి నైషధకావ్యము చెప్పందొడంగితి."

ఇట్లున్న పద్యములం జూడఁగ లోకములోనియందఱుకృతిపతులును కవీశ్వరుని గృతి యిమ్మని యడిగినప్పు డెట్లుగా నడిగెదరో అటుల