ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కవి జీవితములు



Antiquities by Mr. R. S. Vol II.) ద్రాక్షారామ శాసనములలో నల్లాడరెడ్డికుమారుని శాసనము 1359 లో నున్నది. దీనింబట్టిచూడ శ్రీనాథునకుఁ గోమటి వేమనచేఁ బైరెండుపాలెము లీయఁబడి యవి మరల నల్లారెడ్డిచే నాక్రమింపఁబడినట్లుగాఁ గాన్పించు. అంతట శ్రీనాథుఁడు అల్లాడరెడ్డి నాశ్రయింపక యుండి యతనియనంతరము రాజ్యమునకు వచ్చినరాచవేమనమన్నన నంది కాశీఖండ మతనితమ్మునకుఁ గృతి యిచ్చినట్లు కాన్పించు. తక్కినవిశేషములు ముందు దేశచరిత్రములో వ్రాసెదను.

వేమారెడ్డిపండితుల కిచ్చినసమస్య.

శ్రీనాథుఁడు తాను దిగ్విజయార్థము పోవుచు, వేమారెడ్డిసభాపండితుల కొకసమస్య యిచ్చి తాను మరల నాఱుమాసములకు వచ్చి చేరెద ననియును నంతకులోపున నాపద్యముం బూర్తిచేసి యుంచవలయు ననియుం దెల్పెను. ఆపద్య మెద్దియనగా :-

"క. కొంచెపుజగములలోపల, సంచితముగ నీదుకీర్తి యలవేమనృపా"

పై సమస్యాపూరణంబు చేయుట కాపండితులకుఁ దెలియక యూరకుండిరి. అంతట మఱికొన్ని నాళ్లకు శ్రీనాథుఁడు తనప్రభునికడకు వచ్చి తనతొంటిపద్యము నీక్రిందివిధంబుగఁ బూరించె. ఎట్లన్నను :-

"మించెన్ గరి ముకురంబునఁ, బంచాక్షరి శివుఁడు మదిఁ బ్రపంచముపోలెన్"

ఈ శ్రీనాథుఁడు శృంగారనైషధము, భీమఖండ కాశీఖండము లనుగ్రంథములను రచియించుటకుఁ గొన్నిగాథలు కల్గియున్నట్లగా నీ దేశస్థులు చెప్పుకొనియెదరు. ఆగాథలు గ్రంథములో నెట్లుగా నున్నవో వానిం జూపి పిమ్మట విశేషముగా భేదించువానినిగూడ వివరించెదను.

శృంగారనైషధకృతిని గుఱించినకథ.

ఇందుఁ గృతిపతి యగునతఁడు మామిడి సింగమంత్రి. ఇతని వృత్తాంత మెఱుఁగనివారిచేఁ జెప్పంబడుగాథను, అనంతరము చెప్పం దలంచి తొలుత శ్రీనాథకృతశృంగార నైషధములో వ్రాసినదాని న్వివరించెదను. ఎట్లన్నను :-