ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కవి జీవితములు

రామకృష్ణుఁడు కవిధూర్జటిరహస్యముం బ్రకటించుట.

ఒకానొకదినమునఁ గాళహస్తిమాహాత్మ్యమును దెలిఁగించిన ధూర్జటి యనునొకకవీశ్వరుం డరుదెంచి కృష్ణరాయనితోఁ దనగ్రంథమునుగూర్చి ప్రశంస యొనరించెను. అపు డాతఁ డాగ్రంథముఁ దెప్పించి సావధానముగఁ బరిశీలించి యాకవివాక్చమత్కృతి కెంతయు నలరి పండితులం జూచి. -

"చ. స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కేల కల్గె నీ
     యతులితమాధురీమహిమ?"

అనుసమస్య నిచ్చెను. పండితు లందఱు మేమియు నుత్తర మీఁ జాలక యూరకుండిరి. అపు డీరామకృష్ణుఁడు లేచి "స్వామీ ! నాకొకపక్షమువఱకు వ్యవధానం బిచ్చితిరేని గ్రంథమంతయుఁ జూచి దీనికారణం బూహించెదను. పిమ్మట దేవరచిత్తమునకు నున్న తెఱం గెఱింగించెదను" అని రాజును సమ్మతింప జేసి రామకృష్ణుండు నాఁటనుండియు సభకు రాఁడయ్యెను. ఇ ట్లింటికడ నుండి యాపక్షాంతమున మాఱువేషంబు ధరియించి యాధూర్జటి యున్న యింటికిం జని రాత్రియగువఱకు నటు నిటు దిరిగి యనంతరము మెల్లన నాయింటికడఁ బండియుండెను, నిశీథ మగుడు ధూర్జటి యిలు వెడలి నడువందొడంగెను. అపుడు రామకృష్ణుఁడు ధూర్జటికి దూరదూరంబుగ నుండి వెంటాడించి చనుదెంచుచుండెను. ధూర్జటియు దీని నేమియు నెఱుంగక యెప్పటియట్ల యొకనాగవాసంబునావాసంబులోనికిం జనియె. రామకృష్ణుండును వెనువెంట వచ్చి యాగృహముకడనె పవ్వళించి యుండెను. ధూర్జటి తడవు లో నుండి వెలికిం జనుదెంచెను. అపుడు రామకృష్ణుం డాతనిపదంబుల పైఁ బడి లేచి "స్వామీ! నేను రామకృష్ణుండను యుక్తసమయము గాకుండ వచ్చియుండుటకు క్షమియింపుఁడు. నేను బనివినియెదను. అని యచ్చోటు వాసి త్వరతోఁ జనియె. అపుడు ధూర్జటి రామకృష్ణుండిట్లు కాన్పించుటంజేసి వెఱఁగంది "యేమిదైవమా ? ముందుగతి" యని కొంతతడవు చింతించి యింటికి వచ్చి నిద్రించెను. మఱునాఁడు