ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కవి జీవితములు



కేశముల వ్రేలుముడి గీలించి తిరుమణి దీర్చి శ్రీచూర్ణము సాఁది పీతాంబరధరుఁడై తులసిమాలలు మెడ నిడి యుత్తరీయము వలెవాటుగ నమర్చి యుదకంపుస్థాలియు నక్షమాలయు నొకచేత నుంచుకొని రెండవహస్తమున "స్వర్గవిశేషదర్పణమును నాగబెత్తమును బట్టి పాదుకలం దొడగి రాజమార్గమున నిర్గమించెను. అపుడు జనులందఱును నీతనిఁ జూచి సాక్షా ద్విష్ణుం డగు నని యెంచి నమస్కరించి దాసానుదాసులై తోడ నడువ నారంభించిరి. ఇట్లు బహుజనపరివేష్టితుఁడై రామకృష్ణుఁడు రాజమందిరద్వారము సేరి దౌ వారికుం బిలిచి "స్వాములు వచ్చి యున్నా"రని రాజునకుం దెల్పు మని చెప్పిపుచ్చె. వాఁడు నట్లే యొనరించిన నానరపతి గురున కవ్వార్తఁ దెలిపి యాతనిం దోడ్కొని యా సూరివరుకడ కరుదెంచి యీతఁడు సాకారుఁడై యున్న రామకృష్ణునిగ నెఱింగి వెఱఁగంది మదిం గుంది మూర్ఛనొంద నపు డారాజేంద్రుఁడును "దైవమా ! యెట్టి యాపద తెచ్చితివి? ఇపు డీముప్పు తప్పించుకొను నుపాయ మెద్ది? అని చింతింపుచు ఱాపడి నిలిచి యుండెను. రామకృష్ణుఁడు వారిం జూచి "స్వామీ ! నే దయ్యమును గాను, భూతమును గాను. దేవరకరుణాకటాక్షమున స్వర్గమునకుం జని యచ్చటిభోగము లనుభవించి మీపితృజనప్రార్థితుండనై మీకు సౌఖ్యము సంపాదింప నీభువి కరుదెంచినరామకృష్ణుఁడను న న్న న్యునిఁగ భావింపవలదు. చంపఁ బంచితి రనుకిను కింతయైన నాస్వాంతమున లేదు. ఆచార్యులయాన"అని వట్టుఁ బెట్టికొని యీయిర్వురం దేర్చియుండ వార లాతనిం గవుఁగిలించుకొని "అన్నా ! నిన్ను బన్నముల సందించి చంపఁబంచిననిర్దాక్షిణ్యులము మాయెడఁ గరుణించి మమ్ము మన్నింపు" మని యనేకవిధములఁ ప్రార్థించి యాస్థానమునకుం గొనిపోయి యచ్చో నత్యున్న తాసనమునఁ గూర్చుండఁ బెట్టి తమపితృపితామహులకుశలసంప్రశ్నములు గావింపఁ దొడంగిరి. అపుడు రామకృష్ణుఁడు స్వర్గవిశేషదర్పణము విప్పి దాని వారల కందిచ్చి దీనిసావధానుల రై చూచితిరేని విశేషము లింకను