ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

205



గొబ్బున నేలకు దిగద్రోసి మొగముచూడక గాలపాశానుకారిపాశ జాలముల నాభీలముగ గురుబలిని బంధించి కొట్టుఁడు, మట్టుఁ డనుచుఁ జెట్టలు ప్రేలుచు రాజమందిరము ప్రవేశించి యాతని రాజేంద్రునకుఁ జూపిరి.

రాయఁడు పరితాపము నందుట.

అపుడు రాయఁడు గురునిజూచి ఱాపడి కొంతవడికి దెలిసి అహా ! గురుద్రోహి నైతి నిఁక నాకుఁ దారక మేది? అని కన్నీరు నించుచు "దేశకేంద్రా ! నాయపరాధము సైఁపుఁ డని" పాదముల మీదఁ బడియుండెను. అట్టివానిం గాంచి గుర్వవసాన వాక్యముల నిట్ల నియె. "లెమ్మా రాజశేఖరా" యని యాతని గ్రుచ్చి యెత్తి "ఓభూపతిపుంగవా ! నా కగునవమానమునకు వగవకుము. ప్రారబ్ధ మనుభవింపక తప్పించికొన నేరితరంబు? విధి యలంఘనీయము" అనునాచార్యుం జూచి వృత్తాంత మంతయుఁ దెలిసికొని లయకాల భైరవునిమాడ్కి భీషణాకారుఁడై "దీనికిఁ గుదు రగునీద్రోహిని జమునిమందిరమున కనిచెదఁగాక" యని నిజకింకరులం జూచి "వీనిం దోడ్కొని చని మీఘోరతరకర వాలములచే శిరస్సు తెగనఱికి రం" డని యాజ్ఞ యొసంగెను.

రామలింగని శిరస్సు నఱకుమనుట.

రాజకింకరులు నాతనిం గొని యొకవనికిం జని వధియింప నుండుచో రామకృష్ణుఁడు వారికి ధన మొసంగి సమాధానము చేసికొని యొక మేఁకం జంపి తద్రక్తసిక్తమయినమీహేతి భీతి తొలంగి రాజునకుం జూపుం డని వారిం బంచి తా నింటికిం జని స్వగృహోపరి చంద్రశాలాంతరస్థాయి యై ప్రచ్ఛన్న వేషముతో నుండి తనతల్లిం బిలిచి యిట్లనియె. అమ్మా ! నీకోడలిం దోడ్కొని చని యేడ్చుచు రాజసభాభవనంబుకుం జని యచ్చోటున భూపతిపాదభూపతితు లై యుండ నాతఁడు కారణ మడుగును. అపుడు భుక్తికిఁ గర్మకుఁ గొంతధన మడు