ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

195

   వఖిలభూమీపాల కాస్థానకమలాక, రోదయతరుణసూర్యోదయుఁడవు
   శైవవైష్ణవపురా ణావలినా నార్థ, ములు నీకుఁ గరతలామలకనిభము

గీ. లంధ్రభూమికుచా గ్రహారాభ మైన, శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
   శాఖకోకిలమవు నీవు సరసకవివి, రమ్యగుణకృష్ణరామయ రామకృష్ణ.

పై పద్యములవలన రామలింగము కవిత్వ విశేషములు తెలిసినవాఁడే కాక, యతఁ డాంధ్రదేశములోని తెనాలి యను నగ్రహారము నేర్పర్చినవాఁ డనియును, యాజ్ఞవల్క్యశాఖ (శుక్ల యజుశ్శాఖ) లోని బ్రాహ్మణుఁ డనియును, నతనితండ్రిపేరు రామయ్య యనియును దేలినది.

రామకృష్ణకవి కవిత్వవిశేషములు.

పై రెండుపద్యములలో నీతనికవిత్వవిశేషములుగూడఁ గొన్ని కాన్పించుచున్నవి. దానింబట్టి రామకృష్ణుఁడు సంస్కృతమును దెనిఁగించుటలోను, దెనుఁగును సంస్కృతము చేయుటలోను జతురుఁ డనియును, జతుర్విధకవితావిశారదుఁ డనియును, నాశుకవిత్వనిపుణుఁ డనియును శైవ వైష్ణవపురాణసార వేది యనియును దేలినది. మఱియొక పద్యమువలన నీతనితో సమాను లాంధ్రకవులలో లేరనియుఁ దేలుచున్నది. ఆపద్యము కృతిపతి రామకృష్ణునింగూర్చి చెప్పినట్లుగా నున్నది. అది యెట్లన్నను :-

మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునన్ జుట్టిరా
    విదితం బైనమహిన్ మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ
    కెదు రేరీ సర సార్థబోధఘట నా హేలా పరిష్కారశా
    రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్ర కీర్తీశ్వరా.

రామకృష్ణకవిమతము.

రామకృష్ణుఁడు గ్రంథాంతమునందు రచియించినగద్యముంబట్టియును, నతఁడు గ్రంథారంభములోఁ గృతిపతింగూర్చి వ్రాసిన వర్ణనముంబట్టియు నతండు వైష్ణవమతప్రవిష్ణుఁ డని స్పష్ట మగుచున్నది. రామలింగనామము రామకృష్ణుఁడుగా మాఱినను మాఱవచ్చును.