ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కవి జీవితములు

ఇది యిట్లుండ "ఆంధ్రకవుల చారిత్రము" లో ముక్కుతిమ్మకవి కంటె మల్లయకవి ప్రాచీనుఁ డనియును, ఇందులోఁ జివరఁ జెప్పఁబడిన మలయమారుత కవికిఁ దిమ్మకవి మేనల్లుం డనియును మల్లయకవివలనఁ గృష్ణరాయనితండ్రి యగుసాళువనరసింగ రాజునకు వరాహపురాణము కృతి యియ్యంబడెనుగావున నీమల్లయకవి తిమ్మకవికంటెఁ బూర్వుఁ డనియును వ్రాయంబడియెను. కవులకాలనిర్ణ యమునకుఁగాను రాజుల కాలనిర్ణయమును జేయవలయును గావున ముందుగ నందుఁ జెప్పంబడినరాజులకాలము ప్రస్తుతములో నప్రస్తుత మైనను నీక్రింద సంగ్రహముగా వివరించెదను. ఎట్లన్నను :-

వరాహపురాణములో సాళువనరసింహరాజు వంశవర్ణనము చేయఁబడిన దనియును. అతనివంశములో-

1. గుండ్రాజు.
2. సాళువ మంగరాజు.
3. గౌతరాజు.
4. గుండ్రాజు.
5. తిమ్మరాజు.
6. నరసింహరాజు. లుండిరనియుఁ జెప్పెను.

ఆనరసింహరాజుకడ సేనాని సాళువయీశ్వరరాజు ఈశ్వరరాజు పుత్రుఁడు సాళువనరసింగరాజు. ఇతనివంశము తుళువవంశ మాయెను అని చెప్పి యీశ్వరరాజు ప్రతాప మీక్రిందివిధమున వర్నింపఁబడినట్లు చెప్పఁబడియెను. ఎట్లనఁగా :-

"సీ. ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె, గండికోటపురంబుఁ గదలఁద్రవ్వెఁ
    బెనుగొండ సాధించెఁ బెగ్గులూరు హరించె, గోవెలనెల్లూరు గుంటుపఱిచె
    గుందాణి విదళించె గొడుగుచింత జయించె, బాగూరు పంచముపాడు చేసె
    నరుగొండఁ బెకలించె నామూరు మర్దించె, శ్రీరంగపురమును బారిచమిరె

గీ. రాయచౌహత్తిమల్లధరా వరాహ, మోహనమురారి బర్బరబాహుసాళ్వ
   నారసింహప్రతాపసస్న హనుఁ డగుచు, విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు.