ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

173



దెల్పె. దాని విని ధర్మము దప్పినమనకు వారా భయముపడువారు ? పెద్దల నూరక నొప్పించుట మహాపరాధము. అని యూహించె.

ఒకనాఁడు కృష్ణరాయఁడు గజారోహణముఁ జేసి వాహ్యాళి వెడల నీ పెద్దనకవి పైనుండి వచ్చుచు నొకసందుమళుపుఁ దిరుగునపుడు రాజును మిక్కిలి సమీపమునఁ జూచి భయవినయములు చూపుచు నిలువంబడినఁ గృష్ణరాయఁడు తనలోపమునకు క్షమాపణముఁ జెప్పుట కదియ సమయ మని యెంచి పెద్దనకవిని దన యేనుఁగుపై గౌరవముగా నెక్కించుకొని లోకములోనివర్తమానము లెట్లున్నవి? అని అడుగుడుఁ బెద్దన యాతని కిట్లనియె :-

మ. గవనుల్ బల్లిదమయ్యె ఢిల్లికిని మక్కాకోట మేటయ్యె నీ
    భువనం బెల్ల నదల్చి పుచ్చె ననఁగాఁ బోలేరు సందేరులన్
    దవసం బెక్కె బెడఁదకోటపురకాంతాగర్భనిర్భేదన
    శ్రవణంబయ్యె భవత్ప్రతాపజయవార్తల్ కృష్ణరాయాధిపా.

అని పెద్దన చదువఁగా రాయలు మిగుల సంతసించి యతనికిఁ దనయాభరణం బొక్కదాని నిచ్చి యనంతర మతనిఁ దొల్లిటికంటె విశేషముగ మన్నించుచుండెను. ఈవృత్తాంతమునె యీ పెద్దన కృష్ణరాయనిర్యాణానంతరము చెప్పిన.

    "ఎదురైనచోఁ దనమదకరీంద్రము నిల్పి కేలూఁతయొసఁగి జేసి యెక్కించుకొనియె."

అనుపద్యములో సూచించెను.

ఇట్లుగా విద్యావినోదములు పెక్కులు గావించి కృష్ణరాయఁడు స్వర్గమునకుం జనినయనంతర మీరాయలసంస్థానములోఁ గల్గినతొందర నింకొకచోఁ జెప్పియే యున్నరము. అట్టిసమయమునఁ బెద్దన శత్రు రాజులపై ననేకపద్యంబులం జెప్పె ననియు నట్టిపద్యములవలనఁ గొన్నితొందరలు నివారితము లయ్యె ననియును గలదు. ఆపద్యములలోఁ గొన్ని మన కిపుడు సంప్రాప్తము లైనవి, వానికిఁ గలకథను వానిని వివరించెదను. ఎ.........