ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

137



జేసి యట్లుగా గ్రంథకర్తవలనం దెల్పఁబడియె నని తోఁచును. ఇప్పటికి మనకు దొరకినశాసనసహాయముంబట్టి యేకథ యేరుద్రునికాలములోనిదో కొంత నిర్ణయింపఁగలము. ప్రస్తుతము మనము మాటలాడుచున్న హుళిక్కిభాస్కరునికాలము నుడివినతోడనే పద్మనాయకుల (వెలమల) వృత్తాంతము చెప్పి యట్టివెలమ లందఱును రాజును సేవించి యుండి రని వ్రాసెను. ఈవెలమలశాఖ ప్రతాపరుద్రునికాలములో బడబానలభట్టారకునివలన శపింపఁబడినట్లు పద్మనాయకచరిత్ర యనునొకచారిత్రమువలనం గాన్పించును. అందులకు నొకశాసన మున్నట్లాగ్రంథములో వ్రాయఁబడియున్నది. ఆశాసనకాలము శా. సం. 1019 అయి యున్నది. దీనికి సంబంధించు మొదటిప్రతాపరుద్రునికాలమును సోమదేవరాజీయములో వ్రాయఁబడి యున్నది.

అదెట్లన్నను :-

శా. సం. శా. సం.
కాకతిపోల్రాజు 909 982
రుద్రదేవరాజు 982 1054
మహాదేవరాజు 1054 1057
గణపతిదేవరాజు 1057 1085

ఈప్రకారముగా నున్నవి. కావున సోమదేవరాజీయములో హుళిక్కిభాస్కరుఁడు ప్రతాపరుద్రునియాస్థానమునకు వెళ్లినాఁడని చెప్పినవృత్తాంతమునకు మొదటిరుద్రదేవరా జని సమన్వయించినచో సరిపడి యుండును. ఇది యథార్థముగాఁ గూడఁ గాన్పించును. ఏమనిన నితనిమనుమఁ డగుతిక్కనసోమయాజి గణపతిరాజుసభకుం బోయె ననియు నచ్చో నతనికి భారతార్థంబు లుపన్యసించి చెప్పె ననియు నీగ్రంథములోననే కాన్పించుచున్నది. కావునఁ దిక్కనసోమయాజికిఁ బూర్వుఁ డగుభాస్కరుఁడు గణపతిదేవునకుఁ బూర్వుఁ డగురుద్రమహారాజు కాలములో నుండె నని చెప్పుట సయుక్తికమును నిర్బాధకమును నై యున్నది. కావున భాస్కరునికాలము శా. సం. 950 మొదలు 1000