ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

135



త్రములో వ్రాయఁబడినపద్యము లన్నియుఁ గృష్ణరాయనికాలములోఁ బ్రసిద్ధిఁ జెందినరాయనిభాస్కరునివియును, నతని వంశస్థులవియును గాని రామాయణగ్రంథకర్త యగుభాస్కరునివి కావు. రాయనిభాస్కరునిచారిత్ర మీవఱకే మత్కృతము లగురాజచారిత్రములతో వ్రాయఁబడి యున్నది. అం దీపద్యములును వానివానికిఁ గలకారణములును సూచింపఁబడినవి. "రాయ" లనుబిరు దాంధ్రదేశపు ప్రభువులకుఁ గాక కర్ణాటదేశప్రభువులకే చెల్లును. దానిచేతనే యిప్పటికిని నాదేశములో గొప్పవారిని సంబోధించునపుడు సర్వత్ర "రాయల వారూ 3" అని వాడఁబడుచుండును. అట్లుండఁగా "రాయనిమంత్రిభాస్కరుఁ డని ప్రత్యేకము" వక్కాణించి చెప్పినపద్యములుగూడ రామాయణకవి యగుభాస్కరునకు సమన్వయించుట సంప్రదాయవిరుద్ధ మని మాయభిప్రాయము.

రాయనిమంత్రిభాస్కరునికుమారుని పేరు. [1] కొండన. ఈకొండనయే కొమ్మన యని వ్యవహరింపఁబడు ననుమాటకు గ్రంథదృష్టాంత మేమియును లేదు. కొండన కొమ్మన కావచ్చు ననుదానికిఁ గారణము భాస్కరునివిషయ మయి కలిగినపొఱపాటే యగును.

భాస్కరుని కాలనిర్ణయము.

ఇఁక నీ రామాయణకవియొక్క కాలనిర్ణయముంగూర్చి యాలోచింపవలసి యున్నది. అది యంతయు తిక్కనకాలనిర్ణయముంబట్టి నిష్కర్షింపఁబడును. తిక్కనకాలనిర్ణయ మయినది గనుక నతనితాత యగుభాస్కరునికాలమును సులభముగ నిర్ణయింపవచ్చును. అయినను నాంధ్రకవిచరిత్రములో నీయఁబడినభాస్కరునికాలముంగూర్చి కొంచెము సంవాదింతము :-

బెజవాడమల్లేశ్వరస్వామికి భూమి యిచ్చినట్లుగా నచటి స్తంభమున నొకశాసన మున్న దనియును, నాశాసనములోఁ జెప్పఁబడినరాయన

  1. చూ. ముప్పదియిద్దఱ్దునియోగులపద్యము.