ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

కవి జీవితములు



గతి యోజించెదు ? అనుడు నవ్వి చినవీరన్న "యన్నా ! భయము వలదు. ఈపని నెఱవేఱుప సమర్థుండను. దీనిచే మనకు శాశ్వతయశం బుండును." అని యతనిని ధీరుం గావించి తాను భుజియించి నిజావాసంబునకుం జనియెను. పెదవీరన తమ్మునిమాటయందు గుఱి యుంచి యూఱడిలి కొన్నిదినంబు లూరకుండెను. ఇట్లు కొన్నిదినంబు లుండి తమ్ముఁడు గ్రంథ మెచ్చో నైనను వ్రాయుచున్నాఁడా యని యరయుచోఁ గాలయాపనంబు సేయుటయ కాని కార్యంబు సేయుచున్నట్లు కానరా దయ్యెను. కావున నీతఁడు తమ్మునియాస వదలి యాతనితో మరల నీప్రస్తావన సేయక యూరకుండెను. చినవీరన్న యానెల యంతయు నించుమించుగఁ గడపి యొకానొకదినంబున నింటికి వచ్చి తనవదినెను బిలిచి యొకగది శుభ్రంబు సేసి తగుమాత్రముగ నలంకరించి యొకటి రెండుదీపము లుంచి కొంతచమురు గూడ నుంచు మనియెను. అతని పల్కు లాలించి యావనితయు నట్లే యొనరించినది. పినవీరన్న నాఁటి రేయి యతిత్వరితగతి భుజియించి యాగదిలోనం బ్రవేశించి తల్పునకు గొలుసు తగిలించెను. ఇది యంతయు గ్రంథసన్నాహంబె కావచ్చునని యాతనివదినె గ్రహించినది. అన్న మాత్ర మీవృత్తాంతం బెఱుఁగనివాఁడు గావున దమ్ముఁ డాదినం బింటఁ బవ్వళించునదృష్టము గల్గెనని సంతసించుచుండెను. ఇట్లుండ లోపలనుండి కొంతవడికిఁ దాటాకు వ్రాయ నగుచప్పుడు వీతెంచెను. దానినిఁ దడ వాలించి తమ్ముఁ డేమైనను వ్రాతుచున్నాఁడా? యని భార్య నడుగ నాపె యూరకుండెను. ఇంకొకకొంతవడికి లోపలనుండి నిద్రించువాఁడు బుసకొట్టునట్లుగ వినంబడియెను. దాని విని యిప్పుడు తమ్ముఁడు నిద్రించుచున్నాఁ డని నిశ్చయించెను. మఱికొంతవడికి బుసకొట్టుట తాటియాకువ్రాయుటయుం గూడ వినవయ్యెను. ఇట్టిధ్వనులను తడవు విని యేమియు నిశ్చయింపలేక పెదవీరన మెల్లన లేచి తమ్మునిగదిగుమ్మము సమీపంబునకుం జని నలుగెలంకులు చూచి తలుపున నొక్కచో నున్న రంధ్రం