ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కవి జీవితములు

ఇచ్ఛావిహారవర్తనము.

ఈపినవీరన బాల్యమునుండియు స్వేచ్ఛావిహారంబున నుండునిష్టంబు గలవాఁడు. కావున నీతనిప్రవర్తనము తనవారికిని బరులకును సరిపడి యుండదయ్యెను. ఇతనియన్న యగుపెదవీరన్నయు నీతనినిం జిన్న చూపే చూచుచుండెను. ఇతని యన్న భార్యమాత్ర మీతనిప్రభావమును దెలిసికొని పుత్త్రప్రేమచే గారవించుచు నీతఁ డిలు సేరు సమయంబునకు నన్న పానంబులు సిద్ధపఱిచి యిచ్చుచు నుండెను. ఇట్లింటికి వచ్చి భోజనంబు సేయుట తడవుగ నిలువెడలి భోగభామినులగృహంబులకుం జని యచటనే కాలం బంతయుఁ గడపుచుండెను. ఇతఁడు భోగినీజనభాగధేయుండై యుండియుఁ బక్షంబున కొకపరి రాజదర్శనంబునకుఁ బోవుచుండెను. అహరహంబు పూర్వాహ్ణం బంతయు సుషు ప్తిం గడపి, తములం బుమియుచు, వెలవెలందుకల గృహంబులు వెడలి, స్వగృహంబునకు వచ్చి అపుడు వదినె నడిగి దంతధావనోదకంబుఁ దెప్పించికొని ముఖసమ్మార్జనము సేయుచుండును. ఇట్టిప్రవర్తనంబు గలమనుజులకడ యోగమహిమాతిశయంబు లున్న వని యూహించుటకు నితరుల కేమియుక్తులు గలవు ? కావున నితనియన్నకు నితనియెడఁ గల్గునసూయ దినదినప్రవర్థమానం బయ్యెను. వదినెమాత్ర మీతనిని మిక్కిలి యడఁకువతో గారవించి ముం దీతనిపని నమర్చి మఱి గృహకృత్యంబులు సలుపుచుండును. ఇతనియందు మహిమలు కొన్ని యున్నట్లు వ్రాసి యుంటిమి. వాని నిట జనంబులు వాడికొనునట్లుగ వివరించి, యితనిగ్రంథం బగుజైమినిభారతరచనావృత్తాంతము తర్వాత వ్రాయుదము.

పినవీరనయోగమహిమలు.

ఒకానొకదినంబున నీతఁ డుదయంబున గృహంబునకు వచ్చి డంతధావనోదకంబు తెమ్మని వదినె నడుగుడు నాపె సత్వరంబుగఁ దెచ్చి యందిచ్చినది. అపు డాపెకాలి నుండుపావడంబులు బొళబొళ యని