ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎఱ్ఱాప్రెగ్గడ.

103

ఎఱ్ఱాప్రెగ్గడవంశము.

ఇతనిచే నిందులో ముందుగాఁ జెప్పంబడిన పద్యానుసారముగ శ్రీవత్సగోత్రుఁ డై నట్లును, ఇతనితల్లి పోతమ్మ, తండ్రి సూరన్న యనియు, ఇతఁడు శైవోపాసకుం డనియు, శంకరస్వామి యనుయతీంద్రుల శిష్యుం డనియును సకలభాషాకవిత్వవిశారదుఁ డనియుం దేలినది. ఈ శంకరస్వామి విద్యారణ్యస్వాములకు గురుఁ డగునట్టియు లంబికాయోగ పారగు లైనట్టివిద్యాశంకరులు. విద్యాశంకరులు సన్న్యసించినది శా. సం. 1150. సిద్ధినందినది శా. సం. 1255.

ఈహరివంశగ్రంథమువలన దొరకినచారిత్ర మింతయే అయియున్నది. పైపద్యములవలనఁగాని ఆశ్వాసాంతగద్యమువలనఁగాని యెఱ్ఱాప్రెగ్గడ నియోగి శాఖలోనివాఁడో, వైదికశాఖలోనివాఁడో తెలియఁబడుటలేదు. ఆశ్వాసాంతగద్యములో "ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వర చరణసరోరుహధ్యానానంద సౌందర్యదుర్య శ్రీసూర్య సుకవిసంభవశంభుదా సలక్షణాభిధేయయెఱ్ఱయ నామధేయప్రణీతము" అని యుండుటంబట్టి యీహరివంశగ్రంథమువలన నీసంశయము నివారణ కాలేదు. ఇతనినే యెఱ్ఱప్రెగ్గడ యని వాడుటచేత నియోగియే అని నిశ్చయించినను గ్రంథములోఁ బ్రెగ్గడశబ్దము గాని పర్యాయపదములు గాని వేసికొని యుండక పోవుటచే నీతఁ డెవ్వరో యనుసందియము గల్గును. అది నివారింపఁబడుటకు గ్రంథాంతరముం జూచెదము గాక.

శ్రీమ దాంధ్ర భాగవతమున నెఱ్ఱాప్రెగ్గడవంశస్థుఁ డగుసింగనచే నతని వంశావళి తెల్పఁబడినది. దానింబట్టి చూడ నీతఁడు నియోగి బ్రాహ్మణుఁడే అయినట్లు నీతనివంశంబులో నొక్కఁడు హరివంశము, నొక్కఁడు శ్రీభాగవతములోని కొన్ని భాగములును దెనిఁగించె ననియుం దేలినది. తిక్కనవంశస్థులవలన భారత రామాయణములు తెలిఁగింపఁబడినట్లుగా నెఱ్ఱాప్రెగ్గడవంశస్థులవలన భారతభాగవతములలోని భాగములు తెలిఁగింపఁబడినవి. భాగవతములోని వంశావళిపద్య మెద్ది యనఁగా :-