పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కవిజనాశ్రయము

- వళ్లు. -

క. [1]విశ్రాంతి విరతి విశ్రమ
   విశ్రామ విరామ విరమ విరమణ లనఁగా
   విశ్రుత మగు యతి కృతి కధి
   కశ్రావ్యం బై బెడంగు గా నిడవలయున్ . 60

క. [2]చరణాద్యక్షరమే వడి
   చరణంబుద్వితీయవర్ణసమితియె ప్రాసం
   బరయఁగఁబ్రాసం బొక్కటి
   చరణంబుల వళ్లు వేఱె జగతిం జెల్లున్ . 61


  1. చ - డ లలో నున్నది. క - ద-ప్రతులలో -గీ. విరతి విశ్రమ విశ్రాంతి విరమ విరమ, ణాభిధాన విరామము లనెడి పేళ్లు, యతికిఁ బర్యాయ పదములై యమరుఁ గృతిని, యుక్తపదములఁ గృతులయం దునుపవలయు.-- అనియు, ప -ప్రతిలో -గీ . విరతి విశ్రమ విశ్రాంతి విరమణయతు , లనఁగఁ బర్యాయ శబ్దంబు లగుచు నుండు, యతుల కొప్పగునక్షర తతుల నెల్లఁ , గృతుల నిలుపఁగ రేచన కీర్తి గలుగు. - అనియునున్నది.
  2. క - ప - ద - ల - లో నున్నది. చ - డ - ప్రతులలో, క. విలసత్పాదాద్యక్షర, ములు వళ్లగు
    నాద్వితీయములు ప్రావళ్లు, న్నెలకొని తమ తమ పాదం, బుల యతిపై నన్ని పాదములఁ బ్రా లమరున్. అని యున్నది.