పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

67

గీ. బొగడుచుండుదు రని యి ట్లపూర్వరచన
   నలరఁ జెప్పిన వడిసీస మయ్యె దీని
   పశ్చిమార్ధంబు వడి యొండు పాట నిలుప
   నదియె యక్కిలి[1] వడిసీస మయ్యెఁ గృతుల.[2] 17

వృత్తంబునకు వలె వెలయు నాల్గడుగుల
               వెసఁ బ్రాసములు నిల్పి విరతు లునుపఁ
బ్రాససీసం బగుఁ, బశ్చిమార్ధము నట్లు
               భాసిల్ల నక్కిలి ప్రాససీస
మమరు; మున్ గైకొన్నయతి పాదమం డెల్ల
              నడరిన వడిసీస మనఁగఁ బరఁగు,
నర్ధమర్ధమునకు యతులు వేఱైచనఁ
              జెప్ప నక్కిలివడిసీస మయ్యె;

గీ. నవకలికి నిట్లు ప్రాసంబు లతిశయిల్లు,
   యతులు ప్రాసంబు లిష్టసంగతుల నడవ
   నదియె సమసీస మలరును ; దుదను గీతి[3]
   పరఁగ విషమసీసం బగు భానుతేజ ![4] 18

  1. ద-యంకిలి.
  2. ద-లో నీపద్యము పిదప -- సీసము రెండుగణంబులఁ, బ్రాసంబై మఱియు నిధివిరామం బైనన్ , భాసిల్లు దీనిమీఁదను, జే సిననియమములచేత సీసము లయ్యెన్. అను పద్యమున్నది.
  3. ద-నదియె సమసీస ముత్సాహతుదను గీతి.
  4. స-యును విషమసీస మిఁక విను ముత్తమగుణ. ఈపద్యము పిదప, ప-లో "ఈక్రమానఁ బ్రాససీసము, అక్కిలి ప్రాససీసము , వడిసీసము, అక్కిలిపడిసీసము, అవకలిసీసము, సమసీసము అనఁగా నాఱు తెఱంగు లయ్యె" ననియుఁ, బిదప "ఊహ నా ఱునినుల గణము లొనర" ఇత్యాది పద్యమును గలవు.