పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

47

ఉత్పలమాలావృత్తము. -
     భానుసమాన! వి న్భరనభారలగంబులఁగూడి విశ్రమ
     స్థానమునందుఁ బద్మజయుతంబుగ నుత్పలమాలయై చనున్. 102

అంబురుహవృత్తము. -
     శ్రీరమణీప్రియ ! మల్లియరేచ ! విశిష్టకల్పమహీజ ! భా
     భారసనంబుల నంబురుహం బగు భానువిశ్రమయుక్తమై. 103

[1]ఖచరప్లుతవృత్తము. --
     అమితసాహస! రుద్రవిరామాయత్తములైన నభామసా
     వములగున్ ఖచరప్లుతనామవ్యక్తినియుక్తసమేతమై. 104

[2]ప్రభాకలితవృత్తము. -
     వెలయునజాభరసంబులున్ రవివిశ్రమంబులునుం బ్రభా
     కలితకు నొప్పునగణ్యపుణ్య! లగంబు మీఁద ధరన్ గృతిన్. 105

వ. ప్రకృతిచ్ఛందస్సున కిరువదియొక్క యక్షరంబులు పాదంబుగా 2097152 వృత్తంబులు పుట్టె. అందు,

స్రగ్ధరావృత్తము. —
     శ్రీమన్మూర్తీ! మకారాశ్రితిరభనయయా సేవ్యమై సానుమద్వి
     శ్రామంబై సానుమద్విశ్రమమునమరఁగా స్రగ్ధరావృత్తమయ్యెన్. 106

చంపక మాలావృత్తము. -
     నజభజజల్ జ రేఫలు పెనంగి దిశాయతితోడఁ గూడినన్
     [3]ద్రిజగదభిస్తుతా!బుధనిధీ!విను చంపకమాలయైచనున్ .107

  1. ద-ఖచఫ్లుతము.
  2. క-ద-లలో నున్నది. బ-లో దీనికే భంగ్యంతరముగా లఘుప్రభాకలితనృత్తము గలదు . అమర సజాభరసంబులున్ లగ మందు సూర్యనిరామమున్ , గొమరుగఁ జెందు నవేందుమౌళి లఘుప్రభాకలితాఖ్యకున్.
  3. ద-ద్రిజగదభీష్టదా.