ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ణాలు మొరపెట్టు చున్నవి. యీ మహాస్థలము 3 ఘంటలకు వదిలి 4 ఘంటలకు దిగుడు గనుక త్వరగా భీముని కొల్లము చేరినాను. 6 4 ఘంటలకు పెద్దచెరువు చేరినాను. ఆ రాత్రి అక్కడ వచించి 21 తేది ఉదయమయిన 3. 4 ఘంటకు బయలువెళ్ళి 6 ఘంటలకు నాగులోటి చేరినాను. అక్కడ నించి భోజనోత్తరము 3 ఘంటలకు బయలుదేరి సాయంకాలము 4 ఘంటలకు బయలుదేరి సాయంకాలము 5 ఘంటలకు ఆత్మకూరు చేరినాను.

23 తేది 3 ఘంటలకు అక్కడనుంచి బయలివెళ్ళి కోసెడు దూరములో నుండే నందిగుంట అనేగ్రామము 4 ఘంటలకు చేరి వర్షో పద్రవముచేత అక్కడనే నిలిచినాను. భాట మంచిది. అయితే ముండ్లు విస్తారముగా నున్నవి. ఆ గ్రామము గొప్పది. భ్రాంహ్కణుల యిండ్లు, కోమట్ల యిండ్లు న్నున్నవి. సకల పదార్ధాలున్ను దొరుకును. దేవస్థల్లములున్నవి. ఆ దేవస్థలములో దిగినాను. 20 తేది ఉదయాన 3 ఘంటలకు బయిలుదేరి రెండామడ దూరములోనున్న నివృత్తిసంగమ మనే పుణ్యక్షేత్రము 21 ఘంటలకు చేరినాను. అది కృష్ణాతీరము. ఆ కృష్ణలో తుంగభద్రతో కూడా అయిదు నదులు అంతకు మొందే కలియుచున్నవి. భనాశిని అనే నదిన్ని ఆ స్థలమందు కలియుచున్నది గనుక అక్కడ కృష్ణానది అనర్గళముగా ప్రవహింపుచున్నది. వాసయోగ్యమైన ప్రదేశము. ఏటియొడ్డున ధర్మరాజ ప్రతిష్టితమైన శివస్థల మొకట్యున్నది. బృహస్పతి కన్యాగతు డయినప్పుడు అక్కడ అనేకవేల ప్రజలు వచ్చి కృష్ణపుష్కరాల యాత్ర చేసుకొని పోవుచున్నాదు. సకల పాపాలను నివృత్తిని పొందించే ప్రదేశము గనుక నివృత్తి సంగమ మనేపేరు ఆస్థలమునకు వచ్చినది. ఇరువది బ్రాంహ్మణుల యుఇండ్లున్నవి. కావలసిన పదార్దాలు ప్రియముగా దొరుకును. ఊరుకొండకింద నున్నది. అక్కడ కృష్ణ ఉత్తర వాహినిగా ప్రవహించు చున్నది. ఆ దినము వచ్చినదోవ మహా సుఖకర మహినది. ఎటువంటి ఋతువులోనున్ను సన్న గులక భూమి గనుక భాట ప్రతికూల మయ్యేది కాదు. అడివిలేదు. దోవలో అడుగడునకు గ్రామాదులున్నవి. జలవసతి కలదు. ఊరూరికి శిధిల