ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర*

రచయిత
శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

ఈ చెన్నపట్టణపు కాపురస్థుడయిన శ్రీవత్స గోత్రోద్భ వుడైన యేనుగుల సామయమంత్రి మాధన్యునకు పుత్రుండగు యేనుగుల వీరాస్వామయ్యవారితోను బహుదినములు సహవాసము చేసి స్నేహితుడనై యుండిన నేను, ఆయన చేసిన కాశీయాత్ర చరిత్రలోని సంగతులను వ్రాసేటందుకు ముందుగా ఆ పురుషుని చర్యలను తెలిసిన మట్టుకు చెప్పక పోదునేని ఆయన విషయమై న్యాయము సడిపించిన వాడను కాకపోదు నన్న భయముచేత వాటిని పూర్తిగా వర్ణింపను శక్తి యోగ్యతలు లేని వాడనైనా పూనుకోవలిసి వచ్చినందున వాటిలో కొన్నింటిని సంగ్రహముగా వర్ణించిన వాడ నౌచున్నాను.

యేనుగుల వీరాస్వామయ్యగారికి తొమ్మిదవ యేట పితృని యోగము సంభవించెను. అప్పుడు ఆయన తల్లివినాగా వేరే పోషకులు లేక యుండిరి. తండ్రి వుంచిన ఆస్తిని మితముగానే యుండెను. పండ్రెండవ యేట యింగిలీషు బహు వేగముగా చదవ శక్తిగలిగి యుండినందున అప్పుడు ఆయన ఆపఫీసులో నుండే యగ్జామినరులు యిద్దరున్ను ఆయనను రీడరుగా వుంచుకోవలెనని వివాదపడుచు వచ్చిరి. దానివల్ల ఆ వయస్సులో ఆయనకు కలిగియుండిన సామర్థ్యము తెలియవచ్చుచున్నది. పదమూడవ యేట తిర్నవల్లి కలక్టరు కచ్చేరీలో యింటేరు ప్రిటరుగా నన్ను ట్రాన్సులేటరుగానున్న రెండు సంవత్సరములు వుండి పదియేవనయేట పట్టణమునకు వచ్చిచేరెను. అటుతర్వాతను కొన్ని సంవత్సరములవరకున్ను యింగ్లీషు హవు


  • ఈజీవిత చరిత్రను శ్రీ కోమరేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు రచియించి కాశీయాత్ర చరిత్రతో చేర్చి 1838 లోఅచ్చువేయించారు. ఇంకా ఇతర వివరాలకు పీఠిక చూడండి.