ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగ తాత్పర్యము

పూర్వ ముద్రణమున పుట ఈముద్రణములొని పుటలు

       56. ఇందులో ఆచారాలంకారా హారభేదములు దేశానుసారంగా స్కృతికర్తలు కలగ చేసినందున వొక దేశస్థుడు మరియొక దేశస్థుని నిందించరాదని చెప్పి అందుకు కాశీదేశమందు భోజనానకు దృష్టిదోషము పరిషేచనము చేసుటవల్ల పనిలేదనుచున్నారనిన్ని, ఉదకము పంచభూతములతో చేరినది గనుక అగ్ని మొదలయిన యితర భూతములకు స్పర్స దోషము లేనట్టు ఉదకానకున్న వనిలేదనుచున్నారనిన్ని, పర్యుషితాన్న భక్షణము దక్షిణదేశమందు అనుకూల మని అంగీకరింపబడి యున్నా వుత్తరదేశస్థులు అంగీకరించ లేదనిన్ని దృష్టాంశములు చెప్పబడి యున్నవి.    [65-67]
          59. ఇందులో ప్రపంచమందు యే కార్యమున్ను మంచి చెడుకలిసి యుంచున్నదని చెప్పి అందుకు దృష్టాంతముగా హిందువులు మూఢులకున్ను బాలులకున్ను దైవభక్తి కలగవలనని బింబముల యందు దైవత్వమును ఆరోపించితే పరిపాకమందు కూడా ఆ నమ్మిక పట్టుబడి దైవముయొక్క అఖండ స్వరూపము తెలియకుండా చేయుచున్నదనిన్ని క్రీస్తుమతస్థులు ఆదిలోనే దైవము సర్వ భూతాత్మకమని బోధ చేసుటవల్ల మూఢులున్ను, బాలులున్ను, దైవము కలదనే జ్ఞానమేలేక ముణిగిపోతారనిన్ని విధవలకు వివాహము కూడదంటే బాల విధవలు దు:ఖపడుతారనిన్ని, విధవలకు వివాహము కూడునంటే మొగుణ్ణి చంపి మరివొకణ్ని పెండ్లాడుతారనిన్ని దృష్టాంతములు చెప్పబడియున్నవి.   [68-70]
           71. ఇందులో పరమాత్మడు వొక్కడయినా అనేక మూర్తి భేదములుగా పూజింఛడము బాధకము గాదనిన్ని, సృష్టిసంహారములు చేసే బ్రహ్మరుద్రులకు అవతారము నిమిత్తము




-