పుట:Kasiyatracharitr020670mbp.pdf/404

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిమ్మట యీశ్వరుడు తన ప్రతిభాతిని మూర్తీగాచేసి సుందరుడని నామముపెట్టి పార్వతియొక్క ప్రతిభాతితో పొగడచెట్టుకింద యిద్దరి కిన్ని వివాహముచేసినట్టున్ను ఆ వాహము ఛూడవచ్చిన గంగాస్నాతయయిన భక్తుడు కాలాతీతముగా వచ్చి వివాహము చూడడానకు లేకపోయెనని దు:ఖపడితే అతని గంగను యిక్కడి తటాకములొ విలసింపచేసి మళ్ళీ ఆవివాహ లాంఛన జరిగించి అతనికి దర్శనము యిచ్చినట్టున్ను ఆ వివాహలాంచన ప్రతిసంవత్సరము యిప్పుడు బ్రహ్మోత్సవములో పొగడమాను సేవ అని జరిగేటట్టున్ను బ్రహ్మకు పార్వతి నిమిత్తము తాను ఆడిన తాండవము యీశ్వరుడు యిక్కడ మళ్ళీ దర్శనము అయ్యేటట్టు చేసినట్టున్ను మరికొన్ని కాలాలలో కొందరు భక్తులకు అపహరించబడ్డ భాగ్యాన్ని త్యాగము చేసినట్టున్ను మొట్టమొదట పుట్టిన పురి అయినందున యీవూరు ఆదిపురి అనిపేరు కలిగి తాండవము చూపుటచేత తాండవ ప్రయుక్తమయిన భవును అనే నటనలు ఆడుతూ త్యాగద్వారా త్యాగరాజు అని మూర్తి పేరువహించి వల్మీకనివాసముచేత అదే మూలస్థానమై వుండేటట్టుగా ప్రసిద్దిపడి యున్నది. యిక్కడ మరునాడు దాకా వచింనాను.

3 తేది సాయంకాలము 5 గంటలకు బయిలువెళ్ళి యిష్టులతో కూడా చెన్నపట్టణమునకు అరకోసెడుదూరములో తండయారు వేడులో వుండే నాతోట యిల్లు ఆరుగంటలకు చేరినాను. దారి యిసక పొరభూమి. యిరుపక్కలా తోటలు సత్రాలు దట్టముగా వుండుటచేతనున్ను భాట వెడల్పు చలాకలిగివుండుట చేతనున్ను బహు రమణీయముగా చూడవేదుకగా వున్నది. జగదీశ్వరుడు ఈ తృణాన్ని మేరువు చేసుననే వాక్యము సత్యము అని నేను అతి ఘోర ప్రమాణము చేయగలను. అది యెట్లాగంటే నేను స్వస్థలము వదిలి మళ్ళీచేరినకాలము 15 మాసాలౌ 15 దినాలు 10 నిమిషాలు. నాస్వస్థలము వదిలి దూరదేశము సంచరించి మళ్ళీవఛ్ఛినట్టు నాకు నాపరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లుకూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలముచేర్చినాడు.